Stomach Fat : ఈ జాగ్రత్తలు పాటిస్తే పొట్ట చుట్టూ కొవ్వు చేరటాన్ని సులభంగా నివారించవచ్చు!

పొట్ట సమీపంలో పేరుకుపోయేది చెడు కొవ్వు. దాన్ని తగ్గించాలంటే శరీరానికి మంచి కొవ్వుల్ని అందించాలి. కొన్నిరకాల హార్మోన్ల ఉత్పత్తికీ మంచికొవ్వులు అవసరం. పూర్తిగా నూనె లేకుండా తీసుకునే ఆహారం మరిన్ని సమస్యలకు దారితీస్తుంది.

By following these precautions, fat accumulation around the stomach can be easily avoided!

Stomach Fat : పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వులు చాలా మందిలో ఆందోళన కలిగిస్తాయి. ఈ కొవ్వులను కరిగించుకునేందుకు నానా పాట్లు పడుతుంటారు. అయినప్పటికీ ఏమాత్రం ఫలితం ఉండదు. పొట్ట చుట్టు కొవ్వులు పేరుకుపోవటానికి అనేక కారణాలు ఉంటాయి. నిద్రలేమి, చక్కెరలు పెరగడం, హార్మోనుల్లో అసమతుల్యత, పీసీఓఎస్‌, ఒత్తిడి కూడా పొట్ట పెరగడానికి కారణమవుతాయి. శరీరానికి ఎంత శారీరక శ్రమను అందించినా మనం తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలను పాటిస్తే కొవ్వును తగ్గించుకోవచ్చు.

1. డైట్‌ అనగానే ప్రొటీన్‌, కార్బోహైడ్రేట్స్‌, కొవ్వులను దూరం పెట్టేస్తారు చాలా మంది. అది మంచిది కాదు. ఆకుకూరలు, కూరగాయలకే పరిమితం కాక చిరుధాన్యాలు, పప్పుధాన్యాలను తరచూ తీసుకోండి. అప్పుడే తగినంత ప్రొటీన్‌ అంది బరువు, కొవ్వు తగ్గుదల సాధ్యమవుతుంది.

2. పొట్ట సమీపంలో పేరుకుపోయేది చెడు కొవ్వు. దాన్ని తగ్గించాలంటే శరీరానికి మంచి కొవ్వుల్ని అందించాలి. కొన్నిరకాల హార్మోన్ల ఉత్పత్తికీ మంచికొవ్వులు అవసరం. పూర్తిగా నూనె లేకుండా తీసుకునే ఆహారం మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. రిఫైన్డ్‌ ఆయిల్‌, జంక్‌ఫుడ్‌ వంటివి తగ్గిస్తే చాలు. నూనె పూర్తిగా తగ్గించాల్సిన పనిలేదు.

3. నిద్ర శరీరాన్ని సహజంగా డిటాక్స్‌ చేస్తుంది. మరమ్మతులు చేసి, బరువు తగ్గడానికీ కారణమవుతుంది. నాణ్యమైన నిద్ర కనీసం 7 గంటలు ఉండేలా చూసుకోండి. ఒత్తిడికి గురవుతున్నారేమో గమనించుకొని దాన్ని తగ్గించుకొనే మార్గాలను వెతుక్కోండి. యోగా, ధ్యానం, జీవనశైలిలో మార్పులు వంటివి ఇందుకు సాయపడతాయి.

ఎంత ప్రయత్నించినా పొట్ట తగ్గడం లేదని అనిపించినప్పుడు ముందుగా వైద్యులను సంప్రదించి వారు సూచించిన పరీక్షలు చేయించుకోవాలి. థైరాయిడ్‌, పీసీఓఎస్‌, హార్మోన్ల అసమతుల్యత వంటివి చెక్‌ చేయించుకోండి. అసలు కారణం తెలుసుకొని దానికి తగ్గట్టుగా మార్పులు చేసుకుంటేనే పొట్ట కొవ్వు తగ్గించుకోవడం సాధ్యమవుతుంది.