Camphor (1)
Camphor : హిందూ సాంప్రదాయంలో కర్పూరానికి ఎంతో విశిష్టస్ధానం ఉంది. కర్పూరాన్ని భగవంతుని హారతి ఇవ్వటం కోసమేనని చాలా మందికి తెలుసు. అయితే కర్పూరంలో అనేక ఔషధగుణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన సమస్యలు దరిచేరకుండా చేయటంలో కర్పూరం ఉపకరిస్తుంది. బ్యాక్టీరియాను, క్రిమికీటకాలను నాశనం చేస్తుంది. జ్వరం, మలేరియా వంటి వాటిని నయం చేయటం లో ఇది తోడ్పడుతుంది.
శ్వాసకోశ సంబంధిత సమస్యల పరిష్కారినికి, ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే వ్యాధులను తగ్గించటానికి కర్పూరం తోడ్పడుతుంది. జలుబు నయం కావటానికి దీనిని ఉపయోగించవచ్చు. కర్పూరం ద్వారా తయారు చేసే కర్పూర తైలం ఉత్తేజితపూరిత మైన ద్రవ్యంగా చెప్పవచ్చు. రక్తప్రసరణ, మెటబాలిజం, జీర్ణశక్తి, శరీర వ్యర్ధాలను బయటకు పంపటం వంటివాటిలో కర్పూరం బాగా ఉపకరిస్తుంది.
కర్పూర తైలం యాంటీ సెప్టిక్ గా , సూక్ష్మజీవుల నాశనం చేయటంలో సహజ రక్షణ కారిగా పనిచేస్తుంది. వర్షకాలం , వేసివి కాలం తాగేనీటిలో కర్పూరం వేసుకుని సేవిస్తే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. దగ్గు సమస్యతో బాధపడుతున్నవారికి దగ్గును నియంత్రించటంలో బాగా ఉపకరిస్తుంది. శ్వాసనాళంలో కర్పూరం ఉండే పదార్ధాలు పూతగా ఏర్పడి దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి.
స్నానం చేసే నీటిలో కర్పూరం వేసుకుంటే శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షించుకోవచ్చు. దగ్గుకోసం ఉపయోగించే సిరప్ లలో, స్వీట్లలో సైతం కర్పూరాన్ని కలుపుతారు. వాయునాళాలు, ఊపిరితిత్తుల్లో ఆటకంగాలను తొలగించటంలో కర్పూరతైలాన్ని ఉపయోగిస్తారు. నొప్పి నివారిణికి ఉపయోగించే బామ్ ల తయారీలో కర్పూరాన్ని ఉపయోగిస్తారు. రోగాలను కలుగజేసే వాత, పిత్త, కఫ దోషాలకు కర్ఫూరాన్నే ఆయుర్వేదం సిఫార్సు చేస్తుంది.