Saffron : కుంకుమపువ్వు తింటే పిల్లలు తెల్లగా పుడతారా…?

కుంకుమపువ్వులో నిద్రపట్టించే గుణాలు ఎక్కువ. పొట్ట పెరిగే కొద్ది శరీరంల వివిధ రకాల నొప్పులు వస్తాయి. ఆ నొప్పులు నిద్రలేమికి కారణం అవుతాయి. నిద్రలేమి సమస్యను నివారించడానికి రాత్రుల్ల

Saffron

Saffron : కుంకుమ పువ్వు.. ఇది ఎన్నో ఔషదగుణాలు కలిగి ఉంది. సఫ్రాన్, కేసర్, కౌంజ్, జఫ్రాన్ అనే పేర్లతో పిలుస్తారు. ఇది ఒక రకమైన మసాల దినుసుగా చెప్పవచ్చు. సిగ్మా పువ్వులనుండి కుంకుమ పువ్వును తయారు చేస్తారు. మార్కెట్లో ఇది అధిక ధర పలుకుతుంది. మనదేశంలో కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో ఈ కుంకుమ పువ్వును పండిస్తారు. సిగ్మా పువ్వుల నుండి పుప్పొడి రేనువులు, పువ్వు లో ఉండే మూడు రేకలను వేరు చేసి ఎండబెడతారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు కుంకుమ పువ్వు కలిపిన పాలను తాగిస్తారు. తద్వారా పుట్టబోయే పిల్లలు అందంగా, తెల్లగా పుడతారని నమ్ముతుంటారు.

వాస్తవానికి కుంకుమ పువ్వును గర్భందాల్చిన సమయంలో తినటం వల్ల పుట్టబోయే బిడ్డ తెల్లగా పుడుతుందన్న గ్యారేంటీ ఏమీ లేదు. అయితే ఇందులో ఉండే పోషక విలువలు మాత్రం బిడ్డ ఆరోగ్యానికి ఎంతగానో మేలు కలిగిస్థాయని పలు పరిశోదనల్లో తేలింది. గర్భిణీల్లో కండరాల నొప్పులను తగ్గించటంతో పాటు జీర్ణప్రక్రియను మెరుగు పరుస్తుంది. అయితే దీనిని పరిమితంగా మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. గర్భిణీలలో హార్మోన్ల అసమతుల్యత మల్ల మానసిక సమస్యలు ఉత్పన్నమౌతాయి. కుంకుమపువ్వు తీసుకోవటం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇది విడుదల చేసే సెరోటినిన్ అనే పదార్ధం మనస్సును ప్రశాంతంగా ఉంచటం లో దోహదం చేస్తుంది.

ప్రధానంగా గర్భదారణ సమయంలో రక్తపోటు సమస్య బాధిస్తుంది. అలాంటి వారికి కుంకుమ పువ్వు బాగా పనిచేస్తుంది. కుంకుమ పువ్వును పాలలో కలిపి తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ లెవల్స్ తగ్గడానికి సహాయపడుతుంది. గర్భదారణ సమయంలో గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కుంకుమపువ్వు బాగా పనిచేస్తుంది. జీర్ణ వ్యవస్ధ బాగా పనిచేసేందుకు కుంకుమపువ్వు వాడటం ఎంతో మంచిది.

కుంకుమపువ్వులో నిద్రపట్టించే గుణాలు ఎక్కువ. పొట్ట పెరిగే కొద్ది శరీరంల వివిధ రకాల నొప్పులు వస్తాయి. ఆ నొప్పులు నిద్రలేమికి కారణం అవుతాయి. నిద్రలేమి సమస్యను నివారించడానికి రాత్రుల్లో కుంకుమపువ్వు పాలను తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సఫ్రాన్ మిల్క్ తాగడం వల్ల సుఖవంతమైన నిద్రకు అవకాశం ఉంటుంది. గర్భిణీలలో వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. కుంకుమపువ్వు తినడం వల్ల వ్యాధినిరోధకశక్తి మెరుగుపడటానికి సహాయపడుతుంది. అలర్జీలను దూరం చేయడంతో పాటు, జలుబు, దగ్గు, ఇతర అలర్జీలను దూరం చేస్తుంది.

కుంకుమ పువ్వును మోతాదుకు మించి తీసుకోవటం వల్ల కొన్ని రకాల దుష్ఫఫలితాలు చవి చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా గర్భిణీలు కుంకుమపువ్వు తీసుకునే సమయంలో జాగ్రత్తలు పాటించటం మంచిది. వైద్యుల సలహాను పాటిస్తూ దానిని వినియోగించాలి. రోజుకు 10 గ్రాములకు మించి కుంకుమ పువ్వును వినియోగించరాదు. కొంత మందిలో కుంకుమపువ్వు సరిపడకపోవటం వల్ల వాంతులు, వికారం, తలనొప్పి వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఇది బిడ్డ ఎదుగుదల మీద ప్రభావాన్ని చూపిస్తుంది.

 

 

ట్రెండింగ్ వార్తలు