Soaked Peanuts : రోజుకు గుప్పెడు నానబెట్టిన వేరుశెనగలు తింటే క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవా?

ప్రతి రోజూ రాత్రి నిద్రపోయే ముందు ఒక గుప్పెడు విత్తనాలను తీసుకొని, ఒక గిన్నెలో వేసి ఇవి మునిగే వరకు నీళ్ళు పోయాలి. అలా రాత్రిపూట నానబెట్టి, ఉదయాన్నే పొట్టు తీయకుండా తినాలి.

Soaked Peanuts : బాదంపప్పులు మాత్రమే కాదు, రోజువారిగా గుప్పెడు నానబెట్టిన వేరుశెనగలు తింటే శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. ఇదే విషయాన్ని పోషకాహార నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా వేరుశెనగలను వేయించుకొని, ఉడకబెట్టుకొని, ఎన్నో రకాల పొడులు, కూరలలోను ఉపయోగిస్తుంటారు. మరికొందరు పచ్చి విత్తనాలు తినడానికి ఇష్టపడతారు.

వేరుశెనగలలో ఎక్కువగా విటమిన్ ఇ, సెలీనియం,జింకు,ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ వేరుశనగలు తినడం వల్ల, క్యాన్సర్,గుండె సంబంధిత వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కావలసిన పోషకాలను వేరుశనగల ద్వారా అందుతాయి.

శరీరంలో రక్తప్రసరణను పెంచి, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇందులో ఉండే పాలీఫినాల్స్ మన శరీరంలో కలిసిపోయి మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా, చర్మాన్ని కాంతివంతంగా ఉండేలా చేస్తాయి.

రోగనిరోధక శక్తిని పెంచి, శరీరంలో మంట, వాపు,దురదలను కూడా తగ్గిస్తుంది. రాత్రి మొత్తం నానబెట్టిన వేరుశనగ విత్తనాలను పొట్టు తీయకుండా ఉదయాన్నే అల్పాహారంలో తీసుకోవడం వల్ల వీటిలో ఉండే ప్రోటీన్లు అధిక శాతంలో శరీరానికి అందుతాయి. మజిల్ పవర్ కోసం కఠినమైన వ్యాయామాలు చేసేవారు నానబెట్టిన వేరుశెనగలు తినటం వల్ల మేలు కలుగుతుంది.

ప్రతి రోజూ రాత్రి నిద్రపోయే ముందు ఒక గుప్పెడు విత్తనాలను తీసుకొని, ఒక గిన్నెలో వేసి ఇవి మునిగే వరకు నీళ్ళు పోయాలి. అలా రాత్రిపూట నానబెట్టి, ఉదయాన్నే పొట్టు తీయకుండా తినాలి. అధిక బరువుతో బాధపడేవారు ఈ వేరుశనగ విత్తనాలను పొట్టుతో సహా తినడం వల్ల శరీరంలో కొవ్వు కరిగి సన్నగా అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ముఖ్యంగా దానితోపాటు చర్మాన్ని డీహైడ్రేట్ కు గురికాకుండా,తాజాగా ఉండేలా చేస్తుంది. ఎందుకంటే బ్లూ బెర్రీస్ లో ఉండే పోషకాలు కన్నా వేరుశనగ పొట్టులో పోషకాలు అధికంగా ఉన్నాయి. మన శరీరంలో ఉండే టాక్సిన్స్ ను ఎదుర్కొనే శక్తి వీటికి ఎక్కువగా ఉంటుంది.

వేరుశెనగలో బి కాంప్సెక్స్ విటమిన్స్ అధికంగా ఉండటం చేత అందులో రిబోఫ్లెవిన్, థైమిన్, విటమిన్ బి మరియు ఫాంటోథెనిక్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి ఇవి మెదడును చురుకుగా ఉంచడంతో పాటు, రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది.

శరీర ఆరోగ్యానికి మేలు చేసే మోనోఅన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ అధికశాతం మేర కలిగి ఉండే నానబెట్టిన వేరుశెనగలు క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవటంవల్ల క్యాన్సర్ ముప్పు తప్పుతుందని అనేక అధ్యయనాల ద్వారా తేలింది.

 

 

ట్రెండింగ్ వార్తలు