Pool Makhana : పూల్ మఖానాతో బరువు తగ్గొచ్చా?..

అధిక మొత్తంలో ప్రొటీన్లు,ఫైబర్ ఉండటం వల్ల సులభంగా శరీర బరువును తగ్గించుకోవచ్చు. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఈ క్రమం

Lotus Field

Pool Makhana : తామర గింజలు వీటినే ఫూల్ మఖానా అనికూడా అంటారు. మఖానాతో రుచికరమైన వంటలు తయారు చేసుకోవచ్చు. ఉత్తర భారతీయులు మఖానాతో చేసిన వంటలను ఇష్టంగా తింటారు. బీహార్ లో అధికంగా ఈ మఖానాను పండిస్తారు. మఖానా తినటం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో శరీర బరువును తగ్గించుకునేందుకు చాలా మంది మఖానాతో చేసిన ఆహార పదార్ధాలను ఎక్కవగా తీసుకుంటున్నారు. ఇందులో ఉండే అధిక ప్రోట్రీన్లు డైటింగ్ చేసే వారికి మంచి ఆహారంగా ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవటం ద్వారా బరువును సైతం సునాయాసంగా తగ్గించుకోవచ్చు.

అధిక మొత్తంలో ప్రొటీన్లు,ఫైబర్ ఉండటం వల్ల సులభంగా శరీర బరువును తగ్గించుకోవచ్చు. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఈ క్రమంలోనే తొందరగా ఆకలి అనే భావన కలగకపోవడం శరీర బరువు తగ్గించుకోవచ్చు. మఖాన తీసుకోవడం వల్ల బరువు తగ్గొచ్చని ఇదే విషయాన్ని ఆరోగ్యనిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. మఖానాలో యాంటీ బయోటిక్స్ లక్షణాలు పుష్కలంగా ఉండడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన తామర గింజలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

వీటిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. వీటి వల్ల కీళ్ల నొప్పులు కూడా తగ్గిపోతాయి. నిద్రలేమి సమస్యతో సతమతమయ్యేవారు తీసుకుంటే ఈ సమస్యను నివారిస్తుంది. రక్తహీనతకు గల రోగులకు ఇది ఔషధంలా పని చేస్తుంది. గర్భిణీలకు, బాలింతలకు అయితే బలవర్థకమైన ఆహారం ఇది. సోడియం తక్కువగా ఉండడం వల్ల బీపి వ్యాధిగ్రస్తులు కూడా దీనిని తీసుకుంటే చాలా మంచిది.