Carrot Juice : ఆరోగ్యానికి మేలు చేసే క్యారెట్ జ్యూస్! ప్రయోజనాలు తెలిస్తే?

కొద్ది మొత్తంలొ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ప్రత్యేకించి, టైప్ 2 డయాబెటిస్ ఉన్న ఎలుకలలో చేసిన అధ్యయనాలు పులియబెట్టిన క్యారెట్ రసం రక్తంలో చక్కెరను తగ్గిస్తుందని కనుగొన్నారు.

Carrot Juice

Carrot Juice : క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యారట్స్ లో విటమిన్ ఏ, ఫైటో కెమికల్స్, విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. క్యారెట్స్ ను చాలా మంది పచ్చివి తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. పచ్చివి తినేకంటే జ్యూస్ గా చేసుకుని తాగటం మంచిది. ప్రతిరోజు ఒక కప్పు క్యారెట్ జ్యూస్ తాగటం వల్ల ఆరోగ్యానికి అనేక బెనిఫిట్స్ లభిస్తాయి.

క్యారెట్ జ్యూస్ లో కేలరీలు, పిండిపదార్ధాలు తక్కువగా ఉంటాయి. అయితే ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. 250 ఎం.ఎల్ క్యారెట్ జ్యూస్ లో కేలరీలు 96 , ప్రోటీన్ 2 గ్రాములు, కొవ్వు 1 గ్రాము కంటే తక్కువ, పిండి పదార్థాలు 22 గ్రాములు, చక్కెరలు 9 గ్రాములు, ఫైబర్ 2 గ్రాములు, విటమిన్ A 255% రోజువారీ విలువ (డైలీ వ్యాల్యూ DV), విటమిన్ సి 23% DV, విటమిన్ K31% dv, పొటాషియం 15% dv ఉంటాయి. క్యారెట్ జ్యూస్ తీసుకుంటే శరీరంలో యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసే కెరోటినాయిడ్ పిగ్మెంట్లు లుటిన్, జియాక్సంతిన్‌లను అందిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ అని పిలువబడే అస్థిర అణువులతో పోరాడుతాయి.

క్యారెట్ జ్యూస్‌లో కళ్లకు మేలు చేసే అధిక మొత్తంలో పోషకాలు ఉంటాయి. 1 కప్పు (250 ml) క్యారెట్ రసంలో విటమిన్ A 250% కంటే ఎక్కువ DVని కలిగిఉంటుంది. ఎక్కువగా బీటా కెరోటిన్ వంటి ప్రొవిటమిన్ A కెరోటినాయిడ్ల రూపంలో ఉంటుంది. కంటి ఆరోగ్యానికి విటమిన్ ఎ చాలా అవసరం. ప్రొవిటమిన్ A కలిగి ఉన్న పండ్లు మరియు కూరగాయలను తీసుకోవటం వల్ల అంధత్వం, వయస్సు సంబంధిత కంటి వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాల్లో తేలింది. హానికరమైన కాంతి నుండి కళ్లను రక్షించే రెండు ఇతర కెరోటినాయిడ్లు క్యారెట్ రసంలో లభిస్తాయి.

క్యారెట్ జ్యూస్ రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. క్యారెట్ జ్యూస్‌లో ఉండే విటమిన్ ఎ, సి రెండూ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి రోగనిరోధక కణాలను రక్షిస్తాయి. విటమిన్ B6 క్యారెట్ జ్యూస్ లో ఉంటుంది. క్యారెట్ జ్యూస్‌లోని కొన్ని సమ్మేళనాలు క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. క్యారెట్ జ్యూస్ నుండి పాలిఅసిటిలీన్స్, బీటా కెరోటిన్ , లుటీన్ లు మానవ లుకేమియా కణాలకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఒక అధ్యయనంలో 72 గంటల పాటు క్యారెట్ జ్యూస్ ఎక్స్‌ట్రాక్ట్‌లతో లుకేమియా కణాలకు చికిత్స చేయడం వల్ల క్యాన్సర్ కణాల మరణించాయని, కణాల పెరుగుదల ఆగిపోయినట్లు కనుగొన్నారు.

కొద్ది మొత్తంలొ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ప్రత్యేకించి, టైప్ 2 డయాబెటిస్ ఉన్న ఎలుకలలో చేసిన అధ్యయనాలు పులియబెట్టిన క్యారెట్ రసం రక్తంలో చక్కెరను తగ్గిస్తుందని కనుగొన్నారు. ఎందుకంటే రసంలో ప్రోబయోటిక్స్ ఉంటాయి, ఇవి మధుమేహంతో సంబంధం ఉన్న గట్ బ్యాక్టీరియాను ప్రభావితం చేసే ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. క్యారెట్ జ్యూస్‌లోని పోషకాలు ముఖ్యంగా చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి మీ చర్మాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి రక్షించడానికి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. క్యారెట్ జ్యూస్‌లోని బీటా కెరోటిన్ కూడా చర్మానికి సహాయపడుతుంది. కెరోటినాయిడ్ అధికంగా ఉండే ఆహారం చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుండి కాపాడుతుందని అధ్యయనాల్లో కనుగొన్నారు.

క్యారెట్ జ్యూస్‌లోని పొటాషియం మరియు యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును తగ్గించడంలో , గుండె జబ్బులకు కారణమయ్యే ప్రమాద కారకాలను తగ్గించడంలో సహాయపడతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ కెరోటినాయిడ్స్ అధికంగా ఉన్నందున, క్యారెట్ జ్యూస్ కాలేయాన్నికాపాడుతుంది. మలబద్దకం నివారించడంలో క్యారట్ జ్యూస్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. రక్తంలో ఎసిడిటిని తగ్గించడంలో క్యారట్ జ్యూస్ సహాయపడుతుంది. ఈ జ్యూస్ లో ఉండే ఆల్కలైన్ నేచర్ జీవక్రియలో ఎసిడిటిని న్యూట్రలైజ్ చేస్తుంది.