Carrot Juice
Carrot juice : ఆరోగ్యానికి క్యారెట్ ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. క్యారెట్ లో ఉండే ఏ,సి, కె విటమిన్ల తోపాటుగా పొటాషియం ఎక్కువగా ఉ్టుంది. ఇందులోని ఏ విటమిన్ ఊపరితిత్తుల్లో కఫం చేరకుండా చూస్తుండగా, సి విటమిన్ రోగనిరోధ శక్తిని పెంచుతుంది. క్యారెట్ రసానికి కాస్త తేనె జోడించి తీసుకుంటే జలుబు, గొంతునొప్పి వంటివి తగ్గుతాయి. జట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా, చర్మం మెరవాలన్నా, రోజు క్యారెట్ రసం తీసుకోంటే మంచి ఫలితం ఉంటుంది.
శరీరంలో కొవ్వు కరిగేందుకు క్యారెట్ జ్యూస్ ఉపకరిస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. కంటి చూపు మెరుగవ్వటంతోపాటు, చర్మ సంబంధిత అనారోగ్యాలు తొలగిపోతాయి. కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఎముకలు బలంగా మారతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు అదుపులో ఉంటాయి. అల్సర్లు, గ్యాస్ వంటివి అదుపులో ఉంటాయి.
గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. డయాబెటిస్ రోగుల్లో బ్లడ్ షుగర్ స్ధాయి అదుపులో ఉంటుంది. కాలేయంలో కొవ్వులు పేరుకుపోకుండా క్యారెట్ జ్యూస్ ఉపయోగపడుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ ముప్పు ఉండదు. క్యారెట్‌లో జ్యూస్ లో ఉండే అత్యధిక కెరోటినాయిడ్స్, ఆల్ఫా కెరోటిన్, లూటిన్‌లు గుండె వ్యాధులు దరిచేరకుండా కాపాడుతుంది.