Cashew Nuts : గుండెను ఆరోగ్యంగా ఉంచి, రోగనిరోధక వ్యవస్ధను బలోపేతం చేసే జీడిపప్పు!

శరీరంలో కొలెస్ట్రాల్ స్ధాయిలను తగ్గించటంలో జీడిపప్పు బాగా ఉపకరిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ని పెంచటంలో సహాయం చేస్తాయి.

Cashew

Cashew Nuts : జీడిపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి కావాల్సిన శక్తి వీటిని తీసుకోవటం వల్ల లభిస్తుంది. దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి. స్వీట్లు, ఆహారంలో జీడిపప్పును ఉపయోగిస్తారు. జీడిపప్పు తినటం వల్ల జ్ణాపక శక్తి మెరుగవుతుంది. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. రక్తపోటును నియంత్రణలో ఉంటుంది. ఇందులో యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచేందుకు తోడ్పడతాయి. బరువు తగ్గడానికి కూడా దీనిని డైట్‌లో చేర్చుకుంటే ఫలితం ఉంటుంది.

మెగ్నీషియం, మాంగనీస్‌ కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మాంసంలో ఉండే ప్రొటిన్‌కు సమానంగా జీడిపప్పులోనూ ప్రొటిన్‌ ఉంటుంది. జీడిలో కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు ఎక్కువ. విటమిన్‌ ఇ, కె, బి6 పుష్కలంగా లభిస్తాయి. క్యాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం లాంటి ఖనిజ లవణాలు కూడా మెండుగా ఉంటాయి. జీడిపప్పులో పైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో ఉండే సూక్ష్మ పోషకాలు రోగనిరోధకశక్తి పనితీరును మెరుగుపరుస్తాయి.

శరీరంలో కొలెస్ట్రాల్ స్ధాయిలను తగ్గించటంలో జీడిపప్పు బాగా ఉపకరిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ని పెంచటంలో సహాయం చేస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్ధాయిలు తగ్గటం వల్ల గుండె పనితీరు మెరుగవుతుంది. రక్తపోటును తగ్గించటంలో గుండె ప్రమాదాలను తగ్గించటంలో జీడిపప్పు దోహదపడినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. జీడిపప్పులో ఉండే కాపర్ చర్మం, జుట్టు ఆరోగ్యానికి బాగా ఉపకరిస్తుంది. ఇందులో ఉండే లినోలిక్, ఒలీక్ యాసిడ్లు జుట్టు ను సిల్కీగా మారుస్తాయి. వృద్ధాప్య ఛాయలను నివారించటంలో ఇందులో ఉండే పైటో కెమికల్స్, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అద్భుతంగా ఉపయోగపడతాయి.