Cauliflower : చలికాలంలో ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు చేసే క్యాలీఫ్లవర్!

క్యాలీఫ్లవర్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ శరీరాన్ని ఆరోగ్యంగా పని చేయడానికి అవసరమైన పోషకాలను సరైన మొత్తంలో పొందడానికి సహాయపడుతుంది. మెదడు అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

Cauliflower : శీతాకాలంలో ఎక్కువగా దొరికే కూరగాయలలో క్యాలీఫ్లవర్‌  ఒకటి. ప్రస్తుత కాలంలో క్యాలీఫ్లవర్ మార్కెట్‌లో ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది. కాలీఫ్లవర్ రుచి మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇందులో శరీరానికి మేలు చేసే విటమిన్ కె, బి6, ప్రొటీన్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఫైబర్, పొటాషియం , మాంగనీస్ కూడా ఉన్నాయి. కాలీఫ్లవర్‌లోని సల్ఫర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇందులోని సల్ఫోరాఫేన్ రక్తపోటును తగ్గించి మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

క్యాలీఫ్లవర్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ శరీరాన్ని ఆరోగ్యంగా పని చేయడానికి అవసరమైన పోషకాలను సరైన మొత్తంలో పొందడానికి సహాయపడుతుంది. మెదడు అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జ్ఞాపకశక్తి అభివృద్ధికి, వేగవంతమైన అభ్యాసానికి సహాయపడుతుంది. జీర్ణకోశ వ్యాధులకు విరుగుడుగా ఉపయోగపడుతుంది. క్యాలీఫ్లవర్‌లో కేన్సర్ వంటి నయం చేయలేని వ్యాధులను నివారించడంలో సహాయపడే కొన్ని గుణాలు ఉన్నాయి. క్యాలీఫ్లవర్‌లోని సల్ఫోరాఫేన్ కేన్సర్ మూలకణాలను నాశనం చేయడంలో సహాయపడుతుంది. ఇది వివిధ రకాల కణితుల పెరుగుదలను నిరోధిస్తుంది.

కాలీఫ్లవర్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ధమనుల వాపును నివారించడానికి సహాయపడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా చలికాలంలో శ్వాసకోస సమస్యలు చాలా మందిని బాధిస్తుంటాయి. ఈ కాలంలో క్యాలీఫ్లవర్ తినడం వల్ల ఊపిరితిత్తులను కాపాడుతుంది. ఆస్తమా పెరగడానికి కారణమయ్యే సూక్ష్మక్రిములను సులభంగా నివారించుకోవచ్చు. శ్వాసప్రక్రియ మెరుగుపడేందుకు కాలీఫ్లవర్‌ని క్రమం తప్పకుండా తీసుకోవాలి.

కాలీఫ్లవర్ మోతాదుకు మించి తీసుకుంటే ;

జీర్ణక్రియలో సమస్య ఉన్నవారు క్యాలీఫ్లవర్ ను ఎక్కువ పరిమాణంలో తీసుకోవటం మంచిదికాదు. ఇది గ్యాస్ మరియు జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. కాలీఫ్లవర్ అధిక వినియోగం గ్యాస్ సమస్యలను కలిగిస్తుంది. గ్యాస్‌ సమస్యతో బాధపడేవారు తినడం మానుకోవాలి. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు తీసుకోరాదు. ఒకవేళ తీసుకుంటే మాత్రం టి3, T4 హార్మోన్లను పెంచుతుంది.

ట్రెండింగ్ వార్తలు