Cerebral Policy
Cerebral Palsy : భారతదేశంలో 1% మంది పిల్లలు బ్రెయిన్ డ్యామేజ్‌తో బాధపడుతున్నారు. దీనినే సెలెబ్రల్ పాల్సీ అనికూడా అంటారు. బ్రెయిన్ డ్యామేజ్ సమస్య ఉన్నవారిలో చేతులు, కాళ్లపై నియంత్రణ కోల్పోవడం, చచ్చుబడిపోవటం, శరీరంలో బలహీనత ఏర్పడటం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సెలబ్రల్ పాల్సీ అంటే మెదడు పక్షవాతానికి గురవ్వటం అని కూడా చెప్పవచ్చు. ఇది ఒక రకమైన నాడీ సంబంధిత రుగ్మతగా చెప్పవచ్చు. సెరెబ్రల్ పాల్సీ అనేది సాధారణంగా మెదడులోని ఆక్సిజన్ లేకపోవడం, సెరిబ్రల్ ఇస్కీమియా వల్ల కలిగే నాడీ గాయంగా వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యాధి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల ఈ వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు. 26 సంవత్సరాల జైన్ నాదెండ్ల సెరిబ్రల్ పాల్సీతో జన్మించాడు.
ఇది ఎక్కువగా బిడ్డ పుట్టక ముందు, ప్రసవ సమయంలో ఈ వ్యాధి బారిన పడతారు. శిశువులు, పిల్లలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడతారని మెదాంత హాస్పిటల్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్‌లో ఎపిలెప్సీ ప్రోగ్రామ్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ ఆత్మ రామ్ బన్సాల్ చెబుతున్నారు. మెదడు అభివృద్ధి దెబ్బతినటం వల్ల సెలిబ్రల్ పాల్సీకి దారి తీస్తుందని ఆయన చెబుతున్నారు. పుట్టిన తర్వాత పిల్లలలో సెలిబ్రల్ పాల్సీ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి, తల్లిదండ్రులు తమ బిడ్డకు అన్ని సాధారణ శిశు ఇన్ఫెక్షన్‌లకు టీకాలు వేయించాలి. సెలెబ్రల్ పాల్సీ అనేది బాల్యంలో తలకు గాయాలు కావడం వల్ల మాత్రమే కాకుండా, గర్భధారణ సమయంలో,డెలివరీ సమయంలో తరచుగా సంభవించే సమస్యల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
గర్భధారణ సమయంలో,డెలివరీ సమయంలో మంచి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సెరిబ్రల్ పాల్సీని నివారించవచ్చు. పిల్లల మెదడు అభివృద్ధికి డెలివరీ సమయంలో మెరుగైన జాగ్రత్తలు పాటించాలి. కండరాల స్థాయి తగ్గడం, కాళ్లలో గట్టితనం, కాళ్లలో బిగుతు వంటివి సెలిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న పిల్లలలో కనిపించే కొన్ని లక్షణాలు. పక్షవాతం యొక్క ప్రధాన లక్షణం కండరాల దృఢత్వం,దీనివల్ల చేతులు,కాళ్ళను కదిలించడం కష్టతరంగా ఉంటుంది. పోలియో, పక్షవాతం పోలిన వ్యాధి లక్షణాలుంటాయి. స్థిరంగా నడవలేరు, నిల్చోలేరు. వస్తువులను సక్రమంగా పట్టుకోలేకపోవడం వంటివి గమనించవచ్చు. ప్రసవం, గర్భధారణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవటం మినహా నేటికి దీనికి సంబంధించి నిర్దిష్ట ఔషధం ఏమిలేదు. ఫిజికల్ థెరపీలు, వినోద చికిత్సలు మాత్రమే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కండరాల బిగుతు ఎక్కువగా ఉంటే శస్త్రచికిత్స నిర్వహిస్తారు. మరికొంత మందిలో బిగుతును తగ్గించేందుకు బొటాక్స్ ఇంజెక్షన్ చేస్తారు. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయటం మాత్రం సాధ్యపడదు.