Female-Male Friendships : ఆడవారు, మగవారు నిజంగా మంచి స్నేహితులుగా ఉండగలరా?

ఆడవారు, మగవారు మంచి స్నేహితులు ఉండగలరా? ఉంటే ఇద్దరి మధ్య ఎలాంటి సరిహద్దులు ఉండాలి? పెళ్లి తరువాత వీరి మధ్య స్నేహ బంధం కొనసాగాలంటే సాధ్యమా?

Female-Male Friendships

Female-Male Friendships : ఆడ, మగ మధ్య స్నేహం అనగానే కొన్ని పరిధులు ఉంటాయి. సమాజం కూడా పూర్తిగా యాక్సెప్ట్ చేయదు. పెళ్లైన తరువాత జీవిత భాగస్వామి కూడా అంగీకరించకపోవచ్చు. అయినా కూడా హద్దులు దాటకుండా మంచి స్నేహితులుగా మిగిలిన వారు కూడా చాలామంది ఉంటారు. అసలు ఆడ,మగ మంచి స్నేహితులుగా ఉండగలరా? ఉండాలంటే ఎలాంటి పరిధులు ఉండాలి?

 

సినిమాల్లో, టీవీ సీరియల్స్‌లో చూస్తూ ఉంటాం. ఆడ,మగ మంచి స్నేహితులుగా ఉన్నట్లు కథలు వస్తుంటాయి. నిజ జీవితంలో ఒక అబ్బాయితో అమ్మాయి స్నేహం చేసినా..  అమ్మాయితో అబ్బాయి స్నేహం చేసినా కుటుంబ సభ్యులు అంగీకరించరు. ఆడ, మగ మధ్య స్నేహం అనగానే జెండర్ అపోజిట్ వల్ల వారి మధ్య శృంగార ఆకర్షణ కలుగుతుందనే అపోహ చాలామందిలో ఉంటుంది. అందరు స్నేహితుల మధ్య ఇలాంటి ఆకర్షణలు ఉండకపోవచ్చు. అపోహ మాత్రం బలంగా ఉండిపోయింది.

Friendship Band : ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కొంటున్నారా? ఏ రంగు దేనికి సంకేతమో తెలుసా?

ఆడ,మగ స్నేహితుల్లో ఎక్కువగా పురుషులు ఆడవారి పట్ల ఆకర్షితులవుతున్నారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా స్నేహం చేయాలంటే కొన్ని రూల్స్ పాటించాలి. ఎప్పుడైనా మీ స్నేహితుడు లేదా స్నేహితురాలు మీపై ఆకర్షితులవుతున్నారని అనుమానం వస్తే దాని  గురించి మాట్లాడాలి.  సరిహద్దులు నిర్ణయించుకోవాలి.  మీరు ఎందుకు వారితో స్నేహానికి సౌకర్యంగా లేరో వివరించాలి.

 

పెళ్లి తరువాత స్నేహం  కొనసాగించాలంటే జీవిత భాగస్వామి అంగీకరించకపోవచ్చు. ఏ మాత్రం అనుమానపడినా వైవాహిక జీవితానికి ఇబ్బందులు తప్పవు. అందుకే పెళ్లికి ముందు మీకు ఉన్న స్నేహితుల గురించి ఎటువంటి దాపరికం లేకుండా చెప్పాలి. మీ లైఫ్ పార్టనర్ ఎదురుగా ఫ్రెండ్‌తో సరదాగా మాట్లాడటం, లేదంటే తమ స్నేహం చూసి అసూయ పడుతున్నావని కామెంట్ చేయడం సరికాదు. మీరు మిగతా స్నేహితులందరితో ఎలా ఉంటారో అలా వ్యవహరించడం మంచిది. ఆడ,మగ స్నేహాలు ఓ కప్పు కాఫీ తాగడం, సరదాగా సినిమాకు వెళ్లడం, కష్ట, సుఖాలు పంచుకోవడం తప్ప ఒకరినొకరు భౌతిక రూపాల్ని పొగడుకోవడం, రొమాంటిక్‌గా మాట్లాడటం స్నేహం అనిపించుకోదు.

Friendship Hindu mythology : పురాణాల్లో దోస్తులు.. మంచైనా, చెడైనా స్నేహితులని వదలలేదు

మీ జీవిత భాగస్వామి ఎప్పుడైనా స్నేహితులతో మీ ప్రవర్తన చూసి కలత చెందారు అంటే మీరు ఖచ్చితంగా గీత దాటుతున్నారని అర్ధం. స్నేహితుల కష్టాలు, బాధలు విని మీరు సానుభూతి చూపించడంలో తప్పు లేదు. వారికి చేయగలిగిన సాయం చేయవచ్చు. కానీ పెళ్లి తరువాత జీవితం ఇబ్బంది పాలు కాకుండా ఉండాలంటే కొన్ని పరిమితులు విధించుకోక తప్పదు.

ట్రెండింగ్ వార్తలు