Bhairavi Mudra : ఎండవేడి కారణంగా ఎదురయ్యే సమస్యలకు భైరవి ముద్రతో చెక్!

ఒక్కో యోగా ముద్రకు ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. ప్రధానంగా వేసవి కాలంలో ఎండ వేడి నుండి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు భైరవి ముద్ర ఎంతగానో దోహపడుతుంది.

Bhairavi Mudra : ఆరోగ్యానికి యోగాసనాలు ఎంతగానో ఉపకరిస్తాయి. ఆరోగ్యానికి మేలు చేసే ఈ యోగాసనాలను పురాతన కాలం నుండి వారసత్వ సంపదగా నేటికీ అనుసరిస్తూనే ఉన్నారు. యోగాలో అనేక ఆసనాలు, భంగిమలు ఉంటాయి. అలాగే ముద్రలు కూడా ఉంటాయి. ఒక్కో యోగా ముద్రకు ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. ప్రధానంగా వేసవి కాలంలో ఎండ వేడి నుండి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు భైరవి ముద్ర ఎంతగానో దోహపడుతుంది.

వేసవిలో ఎండలు మండిపోతుంటాయి. తీవ్రమైన ఎండల ప్రభావం శరీరంపై పడుతుంది. ఎండ తీవ్రతకు కళ్లు మండం , తల తిరుగుడు, ఆకలి లేకుండటం, తిన్నది అరగక పోవటం, ఊపిరి అందనట్లుగా ఉండటం, చెమటలు పోయటం, తలనొప్పి వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యలు దరి చేరకుండా ఉండాలంటే వేసవి కాలంలో ప్రతిరోజు భైరవి ముద్ర వేయటం వల్ల మంచి ప్రయోజనం చేకూరుతుంది.

భైరవి ముద్రను వేసే విధానం ;

భూరవి ముద్ర వేసేందుకు ముందుగా ప్రశాంతమైన వాతావరణాన్నిఎంచుకోవాలి. సుఖాసనంలోకాని లేదంటే పద్మాసనం, వజ్రాసనంలో కూర్చోవాలి. నడుం వంగకుండా నిటారుగా ఉండేలా చూడాలి. రెండు చేతులను ఒళ్లో ఉంచి ఒక అరచేతిలో ఇంకో అరచేయి పెట్టి ఉంచాలి. కుడి చేయి పైన , ఎడమ చేయి కింద ఉండేవిధంగా చూసుకోవాలి. కళ్లు మూసుకుని నెమ్మదిగా శ్వాసతీసుకుని వదులుతూ శ్వాసమీద ధ్యాసను ఉంచాలి. కనీసం 7నిమిషాల సమయం ఈ భైరవి ముద్రలో ఉంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. మనస్సు ప్రశాతంగా ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు