Coriander : చర్మ సమస్యలకు కొత్తిమీరతో చెక్!..

కొత్తిమీర ఆకులను కడిగి మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. దానికి ఒక చెంచా నిమ్మరసం కలపండి. రెండింటినీ బాగా కలపి ఆ తర్వాత ముఖం, మెడపై అప్లై చేయండి. ఇరవై ఐదు నిమిషాల తర్వాత నీటితో శుభ

Coriander Leaves

Coriander : వంటలో రుచికోసం, వాసనకోసం మనం తప్పకుండా కొతిమీరను వాడతాం. అయితే దీనిలో మనకు ఉపయోగపడే ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలియదు. ఎన్నో రకాల చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి కొత్తిమీర ఆరోగ్యప్రదాయనిగా చెప్పవచ్చు. చర్మాన్ని కాంతివంతంగా మార్చే గుణం  కలిగివుంది. మొటిమలు, పిగ్మెంటేషన్, డ్రై స్కిన్, బ్లాక్ హెడ్స్త తోపాటు, జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. కొత్తిమీర వల్ల కలిగే చర్మ సంబంధిత వ్యాధులు మనదరి చేరకుండా చూడవచ్చు.

చర్మకాంతిని పెంచడానికి కొత్తిమీర ఆకులు ఎంతగానో దోహద పడతాయి. కొత్తిమీర ఆకులను మెత్తని మిశ్రమంలా తయారు చేసి అందులోకి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, మరొక టేబుల్ స్పూన్ తేనే, రెండు టేబుల్ స్పూన్ల పచ్చి పాలు కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొహం మొత్తం ప్యాక్ మాదిరిగా వేసుకుని ఓ అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల మొహం పై ఉన్న దుమ్ము ధూళి కణాలు తొలగిపోయి చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది.

కొత్తిమీర ఆకులను కడిగి మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. దానికి ఒక చెంచా నిమ్మరసం కలపండి. రెండింటినీ బాగా కలపి ఆ తర్వాత ముఖం, మెడపై అప్లై చేయండి. ఇరవై ఐదు నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. చర్మం మృదువుగా మారుతుంది. చనిపోయిన చర్మాన్ని తొలగిస్తుంది. అలాగే మొటిమలు, మచ్చలు కూడా తొలగిపోతాయి.

అదేవిధంగా కొత్తిమీర ఆకులను శుభ్రం చేసి అందులోకి, కొద్దిగా అన్నం, ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసి మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అంటించి ఇరవై నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మం ఎంతో మృదువుగా మారడమే కాకుండా చర్మం పై ఏర్పడిన మొటిమలు మచ్చలు తొలగిపోతాయి.

చర్మం పై ముడతలతో బాధపడేవారు కొత్తిమీర ఆకులను మెత్తగా చేసి అందులో కలబంద జెల్ ని కలిపి మొహానికి రాసుకోవటం వల్ల వల్ల ముఖం పై ఉన్న ముడతలు తొలగిపోయి ఎంతో యవ్వనంగా కనిపిస్తారు. ముఖంలోని కండరాలు, కణాలు చాలా విశ్రాంతిని పొందుతాయి. చర్మం మెరుస్తుంది.

కొత్తిమీర కాడలు ఆకులలో పీచు పదార్థాలు అధికంగా ఉండటమే కాకుండా కేలరీలు తక్కువగా ఉంటాయి.కొత్తిమీరను తరచూ ఆహార పదార్థాలలో భాగంగా తీసుకోవడం వల్ల ఆహారం తేలికగా జీర్ణం అవ్వడమే కాకుండా శరీర బరువు తగ్గడానికి దోహదపడతాయి కొత్తిమీర ఆకులు రసం తీసి అంతే పరిమాణంతో తేనె కలిపి రోజు పడుకునే ముందు తాగితే విటమిన్స్ a, b1, b2, c, ఐరన్ లోపాలతో వచ్చే వ్యాదులు దరి చేరవు. కొత్తిమీరలో క్యాలరీలు తక్కువగా ఉండి, యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్‏ను తొలగిస్తుంది.

కొత్తిమీరలో విటమిన్ ఎ పుష్కలంగా లభించడం వల్ల కంటి సమస్యలను దూరం చేసి కంటి చూపును మెరుగుపరుస్తుంది.ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి కోతిమీరను తరచూ ఆహార పదార్థాల లో భాగంగా తీసుకోవటంవల్ల ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.