కరువుపై సమరం : ఈసారైనా చెన్నైకు తాగునీటి కష్టాలు తప్పేనా?

తమిళనాడును తాగునీటి కొరత వెంటాడుతోంది. తలుచుకుంటేనే వెన్నులో వణుకుపుట్టే కాలం. ఈ ఏడాది సమ్మర్ లో కూడా చెన్నైలో నీటికష్టాలు తప్పేటట్టు లేదు. అందుకే మరోసారి కరువు కష్టాల బారినపడకుండా ఉండేలా ముందు జాగ్రత్త చెన్నై సిటీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.

  • Publish Date - January 25, 2019 / 02:31 PM IST

తమిళనాడును తాగునీటి కొరత వెంటాడుతోంది. తలుచుకుంటేనే వెన్నులో వణుకుపుట్టే కాలం. ఈ ఏడాది సమ్మర్ లో కూడా చెన్నైలో నీటికష్టాలు తప్పేటట్టు లేదు. అందుకే మరోసారి కరువు కష్టాల బారినపడకుండా ఉండేలా ముందు జాగ్రత్త చెన్నై సిటీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.

తమిళనాడును తాగునీటి కొరత వెంటాడుతోంది. కరువు ముప్పు ముంచుకొస్తోంది. కొన్నేళ్లుగా తాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 2016లో సమ్మర్ లో వచ్చిన కరువుతో చెన్నై అల్లాడిపోయింది. 140 ఏళ్ల చరిత్రలో నీటి చుక్క దొరక్క దాహంతో తమిళనాడు ప్రజలంతా తల్లడిల్లిపోయారు. చెన్నై నగర శివారులో ఉన్న నాలుగు నదులు (పూండి, చోలవరం, రెడ్ హిల్స్, చెంబరాబక్కం) ఎండిపోవడంతో తాగునీటి సమస్య తలెత్తింది. రాష్ట్ర రాజధానిలో 50 శాతానికి పైగా నీటి సరఫరా తగ్గిపోయింది. తాగేందుకు నీరు లేక వాటర్ ట్యాంకుల కోసం చెన్నై వాసులు బారులు తీరిన పరిస్థితి అది. తలుచుకుంటేనే వెన్నులో వణుకుపుట్టే కాలం. ఈ ఏడాది సమ్మర్ లో కూడా చెన్నైలో నీటికష్టాలు తప్పేటట్టు లేదు. అందుకే మరోసారి కరువు కష్టాల బారినపడకుండా ఉండేలా ముందు జాగ్రత్త చర్యగా చెన్నై సిటీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.

నీటి సరఫరా పరిమితిపై నగరవాసుల ఆగ్రహం
ఇందులో భాగంగా నగరంలో నీటి కొరతను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. నగరంలో నీటి సరఫరా విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించనున్నారు. తాగునీటిని పరిమితంగా నగరవాసులకు వదిలే యోచనలో ఉన్నారు. ఈ నిర్ణయాన్ని నగరవాసులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చెన్నై నగరమంతా నదులపైనే ఆధారపడింది. ఈ నదుల్లో నుంచే నగర ప్రజలకు తాగు నీరు అందిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో తమిళనాడులోని రిజర్వాయర్లలో నీటి శాతం 77.37 శాతానికి పడిపోయింది. నగరవాసులంతా విలువైన తాగునీటిని వృథా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవడం ఇప్పటి నుంచే ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే చెన్నైకి తాగునీటిని అందిస్తోన్న నాలుగు నదుల్లో నీరు అడుగంటిపోతోంది. ఇప్పటికే చెన్నైలోని డెల్టా జిల్లాలను గజ తుపాన్  అతులాకుతలం చేసింది. ప్రస్తుతం రిజర్వాయర్లలో నీటి నీటిమట్టం స్థాయిలు ఘోరంగా పడిపోయాయి.

ఈ ఏడాదిలో నీటినిల్వలు తగ్గే అవకాశం
2018 ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో నది నీటి నిల్వలు 82.46 శాతం, పూండీలో 89.72 శాతం, చోలవరం 89.72 శాతం, రెడ్ హిల్స్, చెంబారబక్కంలో 96.65 శాతంగా లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం నగరంలో చెన్నై మెట్రో వాటర్ సఫ్లయి అండ్ సేవరేజ్ బోర్డ్ (సీఎండబ్ల్యూఎస్ఎస్ బీ) రోజుకు 650 మిలియన్ల లీటర్ల తాగునీటిని సరఫరా చేస్తోంది. వేసవి సమీస్తుండటంతో నీటి కొరత దృష్ట్యా నీటి సరఫరాను వాటర్ బోర్డు.. 100 మిలియన్ల లీటర్లకు తగ్గించే యోచనలో ఉంది. నీటి సరఫరాను ఒక్కసారిగా తగ్గిస్తే 2017 నాటి కరువు పరిస్థితులు వస్తాయనే నగరవాసుల్లో ఆందోళన వ్యక్తం అవుతుందని వాటర్ సఫ్లయి బోర్డు టీఎన్ఎం అధికారులకు దృష్టికి తీసుకెళ్లింది.ఈ ఏడాది కూడా నది జలాశయాలు క్రమంగా అడుగంటిపోనున్నాయని, సమ్మర్ లో మరింత దారుణమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని పేరు చెప్పేందుకు అంగీకరించని అధికారి ఒకరు తెలిపారు.

అన్నా నగర్, బేసంత్ నగర్, ఆర్ఏ పురం వంటి పలు ప్రాంతాల్లో మధ్య తరగతి నుంచి ఎగువ మధ్య తరగతివాళ్లు నివాసముంటున్నారు. ప్రతిరోజు ఒక్కొక్కరు గ్రౌండ్ వాటర్ తో కలిపి మొత్తం 120లీటర్ల నీటిని వినియోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. తాగునీటి సరఫరా సౌకర్యం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం రోజుకు 50 లీటర్లు మాత్రమే నీటి సరఫరా అవుతున్నట్టు చెప్పారు. గతంలో రాష్ట్ర రాజధానిలో 50 శాతానికి పైగా నీటి సరఫరా తగ్గిపోనుంది. 830 మిలియన్ల లీటర్ల నీటిని రోజువారీగా సరఫరా చేయగా.. కొన్ని ప్రాంతాల్లో మూడురోజులకు ఒకసారి మాత్రమే పైపుతో నీళ్లను సరఫరా చేశారు. కనీసం 300 వాటర్ ట్యాంకర్లతో తాగునీటిని తరలించి నగరవాసులకు అందించారు.

చెన్నై వాసులు చేయాల్సిందిల్లా..
1. నగరంలోని ప్రజలంతా ముందస్తు చర్యగా నీటి నిల్వపై జాగ్రత్తలు తీసుకోవాలి. సమ్మర్ కు ముందే ప్రతిఒక్కరూ విధిగా నీటిని నిల్వచేయడంపై దృష్టిసారించాలి.
2. ఇళ్లు, ఆఫీసుల్లో వాడే గ్రే వాటర్ ను నిల్వ చేయాలి. టాయిలెట్ వాటర్ తో మిక్స్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 
3. గ్రే వాటర్ అంటే.. అపార్ట్ మెంట్లు, కాంప్లెక్స్ ల్లోని సింకులు, షవర్లు, బాత్ రూంలు, వాషింగ్ మిషన్ వాటర్, డిష్ వాష్ వాటర్ ను సేకరించి నిల్వ చేయాలి. 
4. అపార్టమెంట్ కాంప్లెక్స్ లో ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ సిస్టమ్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ యూనిట్ ను అమర్చాలి. 1000 లీటర్ల యూనిట్ కు రూ. 40వేల నుంచి రూ. 80వేల వరకు ఖర్చు అవుతుంది. కానీ, దీనివల్ల దీర్ఘకాల ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. 
5. నీటి సేకరణలో చెన్నై వాసులంతా సంయుక్తంగా కృషిచేయాలి. అప్పుడే నీటి కొరత నుంచి బయటపడేందుకు వీలుంటుంది.