Weight Loss : బరువు తగ్గాలా?అయితే ఈ మూడు రకాల గింజలు తినండీ

బరువు తగ్గాలనుకునేవారికి మూడు అద్భుతమైన గింజలు ప్రకృతి ఇచ్చిన వరాలు. ఈ మూడు గింజలు ఆహారంలో భాగంగా చేసుకుంటే బరువు సులభంగా తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు.

Chia seeds, flaxseed, pumpkin seeds For Weight Loss : బరువు తగ్గాలని చాలామంది అనుకుంటారు. కానీ నోరు కట్టుకుని ఉండలేరు. రకరకాల ఎక్సర్ సైజులు చేయలేదు. కనీసం వాకింగ్ కూడా చేయలేరు. సమయం లేకనో..బద్ధకమో లేకా నిర్లక్ష్యమో. ఇలా కారణం ఏదైనాగానీ బరువు తగ్గాలంటే ఓ పెద్ద కష్టమే. కానీ కొన్ని రకాల ఆహారాలు మన బరువుని ఇట్టే తగ్గించేస్తాయి. వాటిని తింటే శరీరంలో చక్కటి పోషకాలతో పాటు బరువు తగ్గుతాం కూడా మరి అటువంటివేంటో తెలుసుకుందాం..

అవిసె గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు..
అవిసె గింజలు. నున్నగా ఎర్రగా భలే ఉంటాయి. చేత్తో పట్టుకుంటే జారిపోయేంత షైన్ గా ఉంటాయి అవిసె గింజలు. అవిసెగింజల్లో ప్రత్యేకమైన పోషకాలుంటాయి. బరువు తగ్గించటంలో అవిసెగింజలు భలే పనిచేస్తాయి. వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ప్రోటీన్లు ఎంతో మేలుచేస్తాయి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తింటే బరువు తగ్గటంలో చక్కటి మార్పు వస్తుంది. ఫైబర్ ఉండే ఆహారం తింటే వెంటనే కడుపు నిండిపోయినట్లుగా అనిపిస్తుంది. ఎక్కువగా తినలేం. కానీ తక్కువ తిన్నా శరీరానికి చాలా మంచి చేస్తుంది. బరువు తగ్గడానికి కేలరీలను తగ్గిస్తుంటే తినాలనే మీ కోరికను అణచివేయడానికి సహాయపడుతుంది ఫైబర్ ఫుడ్. అంతేకాదు ఫైబర్ ఫుడ్ తీసుకుంటే జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. ఫలితంగా శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది.

అవిసె గింజల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు
అవిసె గింజల్లో ఒమేగా -3 గొలుసు కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. కడుపులో మంటను తగ్గించస్తాయి. కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి అవిసెగింజలు. వీటిల్లో ఉండే కొవ్వు ఆమ్లాలు బరువు తగ్గడానికి ప్రత్యక్ష కనెక్షన్‌ను కలిగిఉంటాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఉంటే అంత స్పష్టంగా లేదు.అవిసె గింజల్ని ప్రతీరోజు ఒక్క టీస్పూన్ తీసుకోవాలి. అలా ప్రతీరోజు తీసుకంటూ బరువు తగ్గడంలో తేడా గమనించవచ్చు. అలాగే అవిసె గింజలు జుట్టు ఆరోగ్యంగా పెరగటానికి చక్కగా ఉపయోగపడతాయి. అలాగే బరువు తగ్గటానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అవిసె గింజల్ని వేగించి..బెల్లంతో కలిపి లడ్డూలుగా చేసుకుని తినవచ్చు.లేదా వేగించిన గింజల్ని పౌడర్ గా చేసి వాటర్ లో ఓ స్పూన్ వేసుకుని తాగితే చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

గుమ్మడి గింజలు..
గుమ్మడికాయ గింజలు చాలా ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ గుమ్మడి గింజల్లో ఒమేగా-ప్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా..భాస్వరం, పొటాషియం, జింక్ లాంటివి మనకు కావాల్సిన అన్ని ఉంటాయి. అవసరమైన అమైనో ఆమ్లాలు, ఫినోలిక్ సమ్మేళనాలు కలిగి ఉంటాయి. ఈ గింజలను తీసుకోవడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు, కండరాలు, ఎముకల నొప్పి, జుట్టు రాలడం వంటి సమస్యలు ఇట్టే తీరిపోతాయి.

కొలెస్ట్రాల్, ఊబకాయం తగ్గించటంలో గుమ్మడి గింజలు పనితనం అంతా ఇంతా కాదు.ఈ గింజలల్లో ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లకు నిలయంగా ఉంటాయి. గుమ్మడికాయ గింజలు తింటే బరువును చక్కగా కంట్రోల్ చేస్తాయి. కాలేయంలో కొలెస్ట్రాల్ స్ట్రాక్ కాకుండా నిరోధిస్తాయి. వీటిలో ఈ విత్తనాలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలతో పాటు ఫైటోస్టెరాల్స్, విటమిన్, కెరోటిన్ ఉంటాయి. ఇవి ఊబకాయం పెరగకుండా నిరోధించడంలో చాలా చక్కగా ఉపయోగపడతాయి.

అంతేకాదు గుమ్మడికాయ గింజలలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, యాంటీ ఆర్థరైటిక్‌తోపాటు యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్, మూత్రాశయ ఇన్ ఫెక్షన్‌లు రాకుండా కాపాడతాయి. అంతేకాదు జుట్టు రాలే సమస్య ఉన్నవారు గుమ్మడి గింజల్ని రోజు తీసుకుంటే హెయిర్ ఫాలింగ్ నిలిచిపోతుంది.గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉండటంతో జుట్టు రాలే సమస్యని నివారిస్తుంది.

 

చియా విత్తనాలు..చియా, సబ్జా విత్తనాలు ఒకేలా కనిపించడం వలన రెండు ఒకటే అని చాలా మంది అనుకుంటారు.కానీ బాగా దగ్గరనుండి పరీక్షిస్తే వాటి మధ్య తేడా తెలుస్తుంది. కానీ బరువు తగ్గాలనుకునేవాిరికి ఈ రెండు మంచి ఉపయోగకరమైనవే. కానీ మనం ఇప్పుడు చియా గురించి చెప్పుకుందాం. శరీర ఆరోగ్యానికి చియా బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు.బరువును త్వరగా తగ్గించే పోషకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. మీరు తొందరగా బరువును తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నపుడు చియా విత్తనాలు ఎంతగానో ఉపకరిస్తాయంటున్నారు డాక్టర్లు. చియా విత్తనాలలో ఫైబర్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్స్ తో పాటు అనేక పోషకాల ఘని అని చెప్పాలి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిని వండి తినొచ్చు..లేదా పచ్చిగా తినవచ్చు.

కాని ఆహారంగా తినాలంటే తినడానికి ముందు నానబెట్టాలి. చియా విత్తనాలు తినడం వల్ల మీ బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగిపోయి సన్నటి నడుము సొంతం చేసుకోవచ్చు.చిన్న చిన్నగా ఉండే చియా గింజలు మాత్రం శక్తినివ్వటంతో పాటు శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును తగ్గటంలో చక్కగా ఉపయోగపడతాయి. తద్వారా చక్కగా బరువు తగ్గేలా చేస్తాయి. చియా విత్తనాలు మన శరీరంలో ఉన్న లిక్విడ్లతో సంయోగం చెంది తర్వాత అవి మందమైన జెల్ గా మారుతాయి.

చియా విత్తనాలను వాడితే బరువు తగ్గుతారని అనేక పరిశోధనల్లో నిరూపించబడింది. చియా విత్తనాలను తీసుకున్న వారి బరువులో వారు తేడాలు గమనించినట్లు సైంటిస్టులు తెలిపారు. కానీ చియా విత్తనాలు తీసుకోని వారితో పోలిస్తే పెద్దగా మార్పులు కనిపించలేదని గుర్తించారు.కాగా..బరువు తగ్గటానికి కేవలం ఇవి తినేస్తే తగ్గిపోతారనుకోవద్దు. వీటిని తీసుకుంటూ వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం..చక్కటి ఫిట్ నెస్ సొంతమంవుతుంది.

ట్రెండింగ్ వార్తలు