Children Are Dying Of Covid At An Alarming Rate In Indonesia
Covid In Children : చిన్నారులపై కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకీ పిల్లల్లో కరోనా మరణాల రేటు పెరిగిపోతోంది. వందలాది మంది చిన్నారులు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇండోనేషియాలో ఇటీవలి వారాల్లో వందలాది మంది పిల్లలు కరోనావైరస్‌తో మరణించారు. వారిలో చాలా మంది 5ఏళ్ల కంటే తక్కువ వయస్సు గలవారే ఉన్నారు. ఇండోనేషియాలో పిల్లల్లో కరోనా మరణాల రేటు ఇతర దేశాల కంటే ఎక్కువగా నమోదైంది.
జూలై నెలలో వారానికి 100 కన్నా ఎక్కువ కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇండోనేషియాలో మొత్తం కరోనా కేసులలో ఇదే ఎక్కువగా అధికారులు పేర్కొన్నారు. పిల్లల మరణాల్లో పెరుగుదల ఆగ్నేయాసియాలో డెల్టా వేరియంట్ కేసులతో సమానంగా ఉందని నివేదిక తెలిపింది. ఇండోనేషియా ప్రభుత్వం దేశీయ మొత్తం జనాభాలో దాదాపు 50వేల కొత్త కేసులు నమోదు కాగా.. 1,566 మరణాలు నమోదయ్యాయి.
శిశువైద్యుల నివేదికల ప్రకారం.. దేశంలో కరోనా కేసులలో మునుపటి నెలతో పోలిస్తే… చిన్నారులు 12.5శాతంగా ఉన్నారు. జూలై 12వ వారంలో మాత్రమే కరోనాతో 150 మందికి పైగా పిల్లలు మరణించారు. ఇటీవల 5ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో సగం మంది మరణించారు. మొత్తంమీద, ఇండోనేషియాలో 3 మిలియన్లకు పైగా కరోనా కేసులు నమోదుకాగా, 83వేల మరణాలు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఇండోనేషియాలో 18ఏళ్ల కంటే తక్కువ వయస్సులో 800 మందికి పైగా పిల్లలు వైరస్ బారిన పడ్డారు.
కరోనా మరణాలలో ఎక్కువ భాగం గత నెలలోనే నమోదయ్యాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలో తక్కువ టీకా రేటు కూడా దీనికి కారణమని అంటున్నారు. ఇండోనేషియాలో కేవలం 16శాతం మందికి మాత్రమే ఒక మోతాదు అందింది. మరో 6శాతం మందికి మాత్రమే టీకాలు అందాయి. కరోనా కేసుల పెరుగుదల కారణంగా ఆస్పత్రులన్నీ వైరస్ బాధితులతో నిండిపోయాయి. కోవిడ్ సోకిన పిల్లల సంరక్షణ కోసం కొన్ని ఆస్పత్రులను ఏర్పాటు చేశారు.