Covid : కరోనా పుట్టుకపై మాట మార్చిన WHO సైంటిస్ట్‌.. అప్పుడే అనుమానం వచ్చిందట!

కరోనావైరస్ పుట్టుకకు చైనానే కారణమని ఎప్పడినుంచో అనుమానాలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు కరోనా పుట్టుక విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సైంటిస్టు మాట మార్చడంతో మరింత అనుమానాలకు దారితీస్తోంది. కరోనావైరస్ చైనాలో ల్యాబ్ నుంచి లీక్ అయిందంటూ అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అందులో వాస్తవం లేదని డ్రాగన్ కొట్టిపారేసింది కూడా.

China Pressured Covid 19 Probe To Drop Lab Leak Theory, Says Who Scientist

China pressured Covid-19 probe : కరోనావైరస్ పుట్టుకకు చైనానే కారణమని ఎప్పడినుంచో అనుమానాలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు కరోనా పుట్టుక విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సైంటిస్టు మాట మార్చడంతో మరింత అనుమానాలకు దారితీస్తోంది. కరోనావైరస్ చైనాలో ల్యాబ్ నుంచి లీక్ అయిందంటూ అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అందులో వాస్తవం లేదని డ్రాగన్ కొట్టిపారేసింది కూడా. చైనాలో కరోనా తొలికేసులను గుర్తించిన ప్రాంతంలో ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సైంటిస్టుల బృందం పరిశోధించింది. అప్పుడు అక్కడి ల్యాబ్ భద్రతా ప్రమాణాలపై అనుమానాలు వచ్చాయని WHO నిపుణుడు పీటర్ బెన్ ఎంబరెక్ ( Peter Ben Embarek) అసలు విషయాన్ని బయటపెట్టారు.

చైనాకు వెళ్లిన WHO పరిశోధక బృందంలో ఈయన ఒకరు.. పరిశోధన సమయంలో ల్యాబ్ ప్రమాణాలపై తనకు అనుమానాలు వచ్చాయని డానిష్ టీవీ (Danish documentarians) డాక్యుమెంటరీలో బెన్ ఎంబరెక్ వెల్లడించారు. వూహాన్‌లోని చైనీస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ల్యాబ్‌ (Wuhan Institute of Virology)లో కరోనా వైరస్‌లను ఉంచారని ఆయన తెలిపారు. అయితే ఆ ల్యాబ్‌ భద్రతా ప్రమాణాలు కరోనా వైరస్‌ కట్టడి చేసే స్థాయిలో లేవని బెన్‌ స్పష్టం చేశారు. చైనా అధికారులు ప్రపంచ ఆరోగ్య సంస్థపై ఒత్తిడి తెవ్వడంతో మహమ్మారి మూలాలకు సంబంధించి విచారణ సమయంలో బయటపెట్టలేదు. వైరస్ లీక్‌ సిద్ధాంతాన్ని విరమించుకోవాలని చైనా ఒత్తిడి తెచ్చిందని ఇప్పుడు బెన్‌ మాట మార్చడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

WHO పరిశోధక బృందం అప్పట్లో వూహాన్‌ నుంచి కరోనా లీక్ కాలేదంటూ నివేదిక ఇచ్చింది. ఈ బృందానికి నేతృత్వం వహించిన బెన్‌ అప్పట్లో తనకు కలిగిన అనుమానాలు ఇప్పుడు బయటపెట్టడం తీవ్ర కలకలం రేపుతోంది. ‘ది వైరస్ మిస్టరీ’ పేరుతో లేటెస్ట్ డాక్యుమెంటరీలో బెన్‌ చైనాకు వెళ్లి.. వూహాన్‌ మార్కెట్లో స్టాల్స్‌ను పరిశీలించారు. అప్పుడు అక్కడ తన అనుమానాలు వ్యక్తం చేయడం వంటి విషయాలు ఉన్నాయి. కరోనా వైరస్‌ ఒక జీవి నుంచి మనిషికి ఈ సీ ఫుడ్ మార్కెట్లోనే సంక్రమించి ఉంటుందని బెన్‌ అనుమానించారు.

వూహాన్‌లోని చైనా ల్యాబ్‌ భద్రతా ప్రమాణాలపై కూడా అనుమానం వ్యక్తం చేశారు. ల్యాబ్ పై తనకు అనేక అనుమానాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు కూడా. మొదట్లో కరోనావైరస్ కు మూలం గబ్బిలాలనే వాదన వినిపించింది. గబ్బిలాల శాంపిల్స్ తీసిన వ్యక్తికి ముందుగా కరోనా సోకి అతడి ద్వారా మనుషులకు వ్యాపించి ఉండొచ్చుననే అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా బెన్ వ్యాఖ్యలతో కరోనా లీక్ పై అనుమానాలకు మరింత బలాన్ని ఇస్తున్నాయి. దాంతో చైనా ల్యాబ్ పై స్వతంత్ర పరిశోధన జరపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.