Chinese Woman : చైనా మహిళకు 2 పునరుత్పత్తి వ్యవస్థలు.. మొదట తల్లి అయ్యింది.. మరో బిడ్డకు తండ్రి అయ్యింది.. ఇదేలా సాధ్యమంటే?

Chinese Woman : చైనాకు చెందిన 59ఏళ్ల లియు అనే మహిళలో 2 పునరుత్పత్తి వ్యవస్థలు ఉన్నాయి. మొదటి పెళ్లితో తల్లి అయ్యింది. రెండో పెళ్లితో మరో బిడ్డకు తండ్రి అయ్యింది.

Chinese Woman With 2 Reproductive Systems

Chinese Woman : అసలు మనిషికి నిజంగా రెండు పునరుత్పత్తి వ్యవస్థలు ఉండవచ్చా? ఒక వ్యక్తి మొదట తల్లిగా ఆ తరువాత తండ్రి కాగలడా? ఇది నిజంగా సాధ్యమేనా? అంటే సాధ్యమే. ఒక వ్యక్తికి రెండు ‘లైంగిక హార్మోన్లు’ ఉంటాయనేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. అలాంటిది నిజంగానే జరిగింది. చైనాకు చెందిన 59ఏళ్ల లియు అనే మహిళలో రెండు పునరుత్పత్తి వ్యవస్థలు ఉన్నాయి.

ఆ మహిళ తన మొదటి పెళ్లితో తల్లి అయ్యింది. ఆ తరువాత ఆమె రెండో వివాహంతో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తండ్రి అయ్యింది. మొదట పెళ్లికి అబ్బాయిని పెళ్లి చేసుకోగా.. రెండో పెళ్లికి అమ్మాయిని పెళ్లి చేసుకుంది. చైనాలో జరిగిన ఈ సంఘటన వెలుగులోకి రావడంతో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ చైనా మహిళ గురించి చర్చ జరుగుతోంది.

Read Also : HMPV Travel Insurance : విదేశాలకు వెళ్తున్నారా? విజృంభిస్తోన్న హెచ్ఎంపీవీ వైరస్.. ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుందా?

18ఏళ్ల వయస్సులో విచిత్ర మలుపు :
ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు ఆమెను అమ్మ అని పిలుస్తారు. మరొకరు ఆమెను నాన్న అని పిలుస్తారు. ఈ లియాకు రెండు పునరుత్పత్తి వ్యవస్థలు ఉండటమే కారణమని చెప్పవచ్చు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ఈ కేసు నైరుతి చైనాలోని బిషన్ కౌంటీ (జిల్లా)లో జరిగింది. దేశంలో చిన్న గ్రామంలో నివసించే లియు 18 ఏళ్ల వయస్సులో విచిత్రమైన మలుపు తిరిగింది.

మొదటి వివాహంతో ఆమె ఒక కొడుకుకు జన్మనిచ్చింది. నైరుతి చైనాకు చెందిన లియాకు రెండు పునరుత్పత్తి వ్యవస్థలనే అరుదైన వ్యాధి ఉంది. నివేదిక ప్రకారం.. మహిళ రెండు వేర్వేరు వివాహాలు చేసుకుంది. మొదటిది పురుషునితో.. రెండవది స్త్రీతో జరిగింది. ఈ రెండు పెళ్లిళ్లతో ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, అధికారిక పత్రాల్లో ఆమెను మహిళగా మాత్రమే గుర్తించడం గమనార్హం.

ఇదేలా జరిగిందంటే? :
చైనాలోని బిషన్ కౌంటీకి చెందిన లియు అనే మహిళ చిన్నప్పటి నుంచి జుట్టు పొట్టిగా ఉండి పురుషుల దుస్తులు ధరించేది. ఆమెకు 18 ఏళ్లు వచ్చినప్పుడు ఆమె టాంగ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఏడాదికి ఆమె కొడుకుకు జన్మనిచ్చింది. ఆమె శరీరంలో చాలా మార్పులు రావడంతో లియు జీవితం మలుపు తిరిగింది.

Chinese Woman Reproductive Systems

ఆండ్రోజెనిక్ హార్మోన్ల ఆకస్మిక పెరుగుదల కారణంగా లియుకు ఒక్కసారిగా గడ్డం పెరగడం ప్రారంభమైంది. ఆమె రొమ్ముల పరిమాణం తగ్గింది. ఆమెకు పురుష పునరుత్పత్తి అవయవాలు కూడా పెరిగాయి. లియులో ఈ మార్పు కారణంగా టాంగ్ ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆమె కొడుకుతో విడిగా జీవిస్తోంది.

రెండో పెళ్లి చేసుకున్న లియు :
చైనా యువతి విడాకుల తర్వాత అబ్బాయిగా కొత్త జీవితాన్ని ప్రారంభించింది. షూ ఫ్యాక్టరీలో పనిచేయడం ప్రారంభించింది. అక్కడ పనిచేస్తున్న జౌ అనే మహిళా సహోద్యోగి పట్ల లియు ఆకర్షితుడయ్యాడు. అయినప్పటికీ, లియు అధికారిక పత్రాలు ఆమెను ఒక మహిళగా గుర్తించాయి. చైనాలో స్వలింగ వివాహం చట్టవిరుద్ధం కాబట్టి ఆమె జౌ మహిళను వివాహం చేసుకోకుండా నిరోధించింది.

అనంతరం ఆమె తన మొదటి భర్త టాంగ్‌ను కలిసింది. ఏకాభిప్రాయంతో ఆమె తన మొదటి భర్త టాంగ్‌ను జౌతో వివాహం చేసింది. ఈ వివాహం షరతు ఏమిటంటే.. లియు, జౌ కలిసి జీవించాలి. కొన్ని రోజుల తర్వాత జౌ గర్భవతి అయ్యి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు లియుకి ఇద్దరు కొడుకులు. టాంగ్ కొడుకు లియుని తల్లి అని పిలుస్తుండగా.. జౌ కొడుకు ఆమెను నాన్నగా పిలుస్తాడు.

వైద్యచరిత్రలోనే అరుదైన కేసు :
సాధారణంగా పురుషులు, మహిళలు వేర్వేరు క్రోమోజోమ్‌లను కలిగి ఉంటారు. పురుషులకు (XY) క్రోమోజోములు, స్త్రీలలో (XX) క్రోమోజోములు ఉంటాయి. అయితే, అలాంటి కేసు చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇది మిలియన్లలో ఒకరికి ఉంటుంది.

అండాశయ రుగ్మతలో ఒక వ్యక్తికి అండాశయ, వృషణ కణజాలం రెండూ ఉంటాయి. అండాశయం, వృషణ కణజాలాలు విడివిడిగా ఉండవచ్చు లేదా ఒకదానితో ఒకటి కలిసిపోవచ్చు. వైద్య ప్రపంచంలో దీన్ని ఓవోటెస్టిక్యులర్ డిజార్డర్ అంటారు. ఖరీదైన చికిత్స కావడంతో లియు ఇంకా ట్రాన్స్‌జెండర్ సర్జరీ చేయించుకోలేదు. ఇప్పటికీ ఆమె గుర్తింపు కార్డులో మహిళగా ఉంది.

Read Also : HMPV Virus : ప్రపంచాన్ని వణికిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్.. బారినపడ్డ 14వేల మంది అమెరికన్లు.. సీడీసీ రిపోర్టులో సంచలన విషయాలు