Joint Pain
Joint Pain : కీళ్లనొప్పులు ప్రధానంగా వయసు పై బడిన వారికి వచ్చే సమస్య. మోకాళ్లు, మోచేతులు, భుజాలు, భుజాలు ఇలా నొప్పులు కారణంగా సతమతమవ్వాల్సి వస్తుంది. వృద్ధులతోపాటు ప్రస్తుతం యుక్త వయస్సులో ఉన్నవారు సైతం కీళ్ల నొప్పుల బాధతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య దీర్ఘకాలికంగా వేధించడంతోపాటు కీళ్లు, ఎముకలను కూడా బలహీనపరుస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్‌తో సహా అనేక రకాల ఆర్థరైటిస్ వంటివి కీళ్లు, ఎముకలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కీళ్ల వాపు, నొప్పి, దృఢత్వం, పనితీరు కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటాయి. తీవ్రమైన నొప్పి వాపు. మంటతో పాటు ప్రభావిత ప్రాంతం చర్మంపై ఎర్రగా మారటం జరుగుతుంది. ఈ సమస్య నుండి బయటపడాలంటే రోజువారిగా తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. తద్వారా సులభంగా సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. కొన్ని ఆహారపదార్థాలను రోజువారిగా తినాలి. వీటిని రోజువారీ తీసుకుంటే మరీ మంచిది. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కీళ్లనొప్పులు లేకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహారాలు ;
1. అరటి పండు ; అరటి పండ్లు తినడం మంచిది. వీటిలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఎముకల సాంద్రతను పెంచుతుంది. వీటిలో ఉండే మెగ్నిషియం కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. రాగులు, జొన్నలు, సజ్జలు ; రాగులు, జొన్నలు, సజ్జలు రోజువారీ ఆహారంలో తీసుకోవాలి. అలా తింటే శరీరానికి కావాల్సిన కీలక పోషకాలు అందుతాయి. ఎముకలు దృఢంగా మారి కీళ్ల నొప్పులు తగ్గి చలాకీగా ఉండేందుకు అవకాశం ఉంటుంది.
3. పసుపు, పాలు ; రోజూ పసుపు ఒక గ్లాస్ పాలలో అర టీస్పూన్ కలుపుకొని తాగితే మంచిది. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. వీటి వల్ల కీళ్ల నొప్పి తగ్గతుంది.
4. నారింజ ; నారింజను రోజూ తింటున్నా కీళ్ల నొప్పుల సమస్య మాయమవుతుంది. వీటిల్లో ఉండే విటమిన్ సి ఎముకలకు బలాన్ని ఇవ్వటంతోపాటుగా దృఢంగా మారుస్తుంది.
5. చేపలు ; చేపల్ని తరచూ తినడం మంచిది. వీటిలో ఒమెగా ౩ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే వాపులను తగ్గించి, కీళ్ల నొప్పులను పోగొడతాయి. కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు రొయ్యలను తినాలి. వీటిలో ఉండే విటమిన్ కీళ్ల నొప్పులను పోగొడుతుంది.
6. బ్లూబెర్రీలు ; బ్లూ బెర్రీలు మనకు మార్కెట్‌లో దొరకుతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వీటిని తరచుగా తింటే నొప్పులు, వాపులు తగ్గుతాయి.
7. పీనట్ బటర్ ; పీనట్ బటర్ మనకు మార్కెట్‌లో దొరకుతుంది. దీనిలో ఉండే విటమిన్ బి౩ ఎముకలకు ఎంతగానో అవసరం. రోజూ పీనట్ బటర్ తింటే ఎముకలు దృఢంగా మారి కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
8. గ్రీన్ టీ ; గ్రీన్ టీ తాగితే చాలా మంచిది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు శరీరంలో నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఎముకలు విరగకుండా, వాటి సాంద్రతను పెంచే గుణాలు గ్రీన్ టీలో ఉంటాయి.
ఇది సరైన చికిత్స కోసం, ఆర్థరైటిస్ లక్షణాలను ముందుగానే గుర్తించడంతోపాటు జీవనశైలిలో మార్పులు చేయడం చాలా ముఖ్యం. సరైన సమయంలో గుర్తించనట్లయితే ఎముకలు, కీళ్లకు నష్టం వాటిల్లుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.