Coconut Oil : చర్మంపై మచ్చలు మాయం చేసే కొబ్బరి నూనె!

రాత్రి పడుకునే ముందు ముఖానికి కొబ్బరి నూనె అప్లై చేయడం వల్ల వివిధ రకాల చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. శరీరంలోని పొడి ప్రదేశాలలో దీనిని ఉపయోగించవచ్చు.

Coconut Oil : కొబ్బరి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా మందికి తెలుసు. అయితే కొబ్బరి నుండి తీసిన కొబ్బరి నూనెను మాత్రం జుట్టు బలానికి ఉపయోగిస్తారు. అయితే జుట్టుతోపాటు చర్మానికి కొబ్బరి నూనె అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది. కొబ్బరి నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లినోలిక్ యాసిడ్, విటమిన్ ఎఫ్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనె చర్మంలో కొల్లాజెన్ ను పెంచి ముడతలను తగ్గిస్తుంది. చర్మానికి సహజ మాయిశ్చరైజర్ గా పనిచేసి చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా మారుస్తుంది.

రాత్రి పడుకునే ముందు ముఖానికి కొబ్బరి నూనె అప్లై చేయడం వల్ల వివిధ రకాల చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. శరీరంలోని పొడి ప్రదేశాలలో దీనిని ఉపయోగించవచ్చు. సూర్యరశ్మి కారణంగా చర్మంపై మచ్చలు ఏర్పడుతుంటాయి. ఇవి అందానికి అడ్డంకిగా మారతాయి. కొబ్బరినూనెను ఉపయోగించటం ద్వారా మచ్చలు పోగొట్టుకోవచ్చు. మచ్చలు తొలగించుకోవాలంటే ప్రతిరోజు అరచేతిలో టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసుకుని మచ్చలు ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి. రెండు నెలల్లోనే మీరు చర్మంపై మార్పు గమనించవచ్చు.

కొబ్బరి నూనెలో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. ఇది గాయాలను తగ్గిస్తుంది. శరీరం ముడతలు పడకుండా ఉండేందుకు కొబ్బరి నూనెలోని విటమిన్ ఈ ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ చర్మపై పేరుకుపోయిన మలినాలను తొలగించటంలో తోడ్పడతాయి. గాయాలు తగిలిన సందర్భంలో కొబ్బరి నూనెను, కొద్దిగా పంచదారతో కలిపి పేస్ట్ గా చేసి గాయంపై పూయాలి. ఈ మిశ్రమంలో ఉండే లారిక్ యాసిడ్ మంచి మందులా పనిచేస్తుంది. దీని వల్ల గాయం త్వరగా మానుతుంది.

ట్రెండింగ్ వార్తలు