Colorful Holi : రంగుల హోలీలో…నిర్లక్ష్యం వద్దు…జాగ్రత్తలు తప్పనిసరి

హోలీ ఆడే ముందు మీ శరీర చర్మానికి, వెంట్రుకలకు నూనె రాసుకోవటం మంచిది. ఎవరైనా రసాయనాలతో నిండిన రంగులను ఉపయోగిస్తే, ఆ నూనె మీ చర్మానికి రక్షణ పొరలా పనిచేస్తుంది.

Holi (1)

Colorful Holi : హోలీ పండగను వసంత ఋతువు ఆగమనానికి సూచికగా పౌర్ణమి రోజున జరుపుకుంటారు. చలికాలం ముగిసి ఎండాకాలం ఆరంభానికి నాంది ప్రస్థావన లాంటిది. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో హోలీ ఒకటి. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను.. హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అంటారు. ఈ పండుగను స్నేహితులు ,కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవడం, ప్రజలు తమ కష్టాలను మరచిపోయి ఈ పండుగలో సోదరభావాన్నిచాటుకుంటారు. హోలీ అనేది ఒక రంగుల పండుగ. ఈ ఏడాది హోలీ పండుగను మార్చి 18, 2022న జరుపుకోనున్నారు.

అయితే పండుగ కార్యక్రమంలో రంగులను చల్లుకుంటూ పండుగను ఆస్వాదించటం అనాదిగావస్తున్న అచారసాంప్రదాం. ఈ సందర్భంలో జుట్టు ,చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. మార్కెట్‌లోని అసహజ రంగులు చర్మానికి హాని కలిగించడమే కాకుండా కళ్ళు, జుట్టు మొదలైన వాటిని కూడా దెబ్బతీస్తాయి. హోలీ అడే సందర్భంలో అనుసరించాల్సిన కొన్ని సూచనలు, సలహాలను నిపుణులు అందిస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం..

హోలీ జాగ్రత్తలు ;

సేంద్రీయ రంగులు సహజ పువ్వులతో తయారైన రంగులను హోలీ అడేందుకు వినియోగించటం మంచిది. పూలు, కూరగాయల నుండి ఇంట్లోనే సహజ రంగులను తయారు చేసుకోవటం మంచిది. ప్రస్తుతం మార్కెట్లో సైతం సేంద్రీయ,సహజ రంగులు అందుబాటులోకి వచ్చాయి. వాటిని కొనుగోలు చేయవచ్చు. రసాయనాలతో నిండిఉన్న రంగులను వాడకపోవటమే మంచిది. ఎందుకంటే వాటి వల్ల చర్మం, కళ్ళు ,జుట్టుకు హాని కలుగుతుంది. గోరింట ఆకులతో ఆకుపచ్చని రంగు ద్రావణాన్ని, బీట్ రూట్‌తో గులాబి రంగు ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. పసుపు కొమ్ములను దంచి నీళ్లలో నానబెట్టి పసుపు రంగు వాటర్ ను ఇలా చెట్ల ఆకులు, పూలతోనే ఇంట్లోనే సహజంగా రంగుల ద్రావణాలు తయారు చేసుకోవటం మంచిది.

హోలీ ఆడే ముందు మీ శరీర చర్మానికి, వెంట్రుకలకు నూనె రాసుకోవటం మంచిది. ఎవరైనా రసాయనాలతో నిండిన రంగులను ఉపయోగిస్తే, ఆ నూనె మీ చర్మానికి రక్షణ పొరలా పనిచేస్తుంది. నూనె జుట్టు , చర్మంపై జిడ్డుగల రక్షణ పొరను సృష్టిస్తుంది. ఈ పొర జుట్టు, మన చర్మం యొక్క ఫోలికల్స్‌లో రంగులు చొరబడకుండా అడ్డంకిగా పనిచేస్తాయి. ఆయిల్ ఆధారిత లేయర్ ను హోలీ వేడుకల తర్వాత రంగును సులభంగా కడుక్కోవడానికి వీలుంటుంది. మీ చర్మాన్ని కొబ్బరి, ఆలివ్, బాదం, ఇతర నూనెల నుండి ఎంచుకోవటం మంచిది. ఈ నూనెలు మీ చర్మాన్ని రక్షించడమే కాకుండా పోషణ , హైడ్రేట్ గా పని చేస్తాయి.

హోలీ తర్వాత, సహజ సబ్బులతో స్నానం చేయండటం మంచిది. ఎందుకంటే హెర్బల్ సబ్బులు రంగును సున్నితంగా తొలగించడమే కాకుండా చర్మానికి పోషణను అందిస్తాయి. గంధం , పసుపుతో చేసిన సబ్బులు, కుంకుమపువ్వుతో కుంకుమది నూనె, యాక్టివేటెడ్ చార్‌కోల్, తేనె , బాదం నూనెతో చేసిన సబ్బులు హోలీ తర్వాత ఉపయోగించడానికి ఉత్తమమైన సోప్స్ గా చెప్పవచ్చు. అవి మీ చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి, జుట్టుకు బాగా నూనె రాసి హోలీ ఆడండి. ఆ తర్వాత తలస్నానం చేసేస్తే రంగులు త్వరగా వదిలిపోతాయి. నూనె రాయకపోతే మాడుకు అంటుకున్న రంగుల వల్ల జుట్టు పొడిబారుతుంది.

కళ్లల్లోకి రంగు వెళ్లకుండా ఏదైనా అద్దాలు ధరించి హోలీ ఆడాలి. లేనిపక్షంలో కళ్లల్లోకి రంగు వెళ్లి కంటి చూపుపై సైతం ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. చర్మ సంబంధమైన చికిత్స చేయించుకున్న వారు అప్పుడే రంగుల జోలికి వెళ్లకూడదు. దానివల్ల చర్మంపై ప్రతికూల ప్రభావం కనిపించవచ్చు. కొన్నిసార్లు దీర్ఘకాలిక సమస్యల బారిన పడతారు. హోలీ ఆడిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. రసాయనరంగుల వల్ల అనుకోని ప్రమాదం జరిగితే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి.