Pneumonia : కోవిడ్ నుండి బయటపడ్డా….న్యుమోనియాతో పోరాటం

ఈ న్యుమోనియా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కి గురవుతున్నట్లు ఇప్పటికే అనేక మందికి నిర్వహించిన పరీక్షలలో స్పష్టంగా తేలింది.

Pneumonia

Pneumonia : కోవిడ్ మహమ్మారి కారణంగా సర్వత్రా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ సైతం తీవ్రప్రభాన్నే చూపిస్తుంది. కోవిడ్ నుంచి బయట పడిన రోగులలో రోగనిరోధక శక్తి తగ్గుతుండటంతో వారు ఆతరువాత న్యుమోనియా సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈ సమస్యను చాలా మంది కోవిడ్ నుండి బయటపడిన రోగులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధుల్లో న్యుమోనియా సమస్య వేధిస్తుంది. కోవిడ్ వచ్చిన తరువాత చాలా మందిలో న్యుమోనియా సమస్య ఉత్పన్నమౌతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.

అయితే కోవిడ్ నుండి తాము రికవరీ అయ్యామని చాలా మంది రోగులు రోగనిరోధకశక్తి పెంచుకోవటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అలాంటి వారు న్యుమోనియా బారిన పడి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ గురవుతున్నారు. కోవిడ్ తరువాత న్యుమోనియా వస్తే దాని విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని వైద్యులు సూచిస్తున్నారు. కోవిడ్ తరువాత ఫంగల్ న్యుమోనియా రోగుల సంఖ్య వేగంగా పెరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు.

ఈ న్యుమోనియా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కి గురవుతున్నట్లు ఇప్పటికే అనేక మందికి నిర్వహించిన పరీక్షలలో స్పష్టంగా తేలింది. గతకొద్దిరోజులుగా కొవిడ్ తరువాత మరణిస్తున్న వారిలో ఎక్కవ మందిలో న్యూమోనియా కూడా వారి మరణానికి ఒక కారణమని తేలింది. న్యుమోనియా, సెప్సిస్ ఒక వ్యాధి. రోగికి సెప్సిస్ ఉంటే అది న్యుమోనియాను మరింత ప్రమాదకరంగా మారుస్తుంది. రోగి రోగనిరోధక వ్యవస్థ పై ఈ వ్యాధి తీవ్రమైన ప్రభావం చూపుతోంది. చాలా మంది వృద్ధులలో న్యుమోనియా ప్రమాదకరంగా మారి చివరకు ప్రాణాలు బలితీసుకుంటుంది.

రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు శరీరం దానికి తగిన విధంగా స్పందించని పరిస్ధితి ఏర్పడుతుంది. దీని ఫలితంగా శరీరంలో నిమోనియా వంటి వ్యాధులు చుట్టుముట్టి చాలా మంది మరణానికి చేరువవుతున్నారు. తీవ్రమైన దగ్గుతో పాటు, పసుపుపచ్చ కళ్లె పడటం, అధిక జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే న్యుమోనియా వచ్చినట్లు గుర్తించాలి. దీని వల్ల ఊపిరితిత్తులకు చాలా నష్టం కలుగుతుంది. నిమోనియా వస్తే రికవరీ అయ్యేందుకు సమయం పడుతుంది.