Constipation Problem : వేసవిలో బాధించే మలబద్ధకం సమస్య!.

శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచి జీర్ణాశయ పనితీరును మెరుగుపరిచటంలో పుచ్చకాయ బాగా ఉపకరిస్తుంది. ప్రేగు కదలికలను ఇది సులభతరం చేస్తుంది. ముఖ్యంగా వేసవికాలంలో పుచ్చకాయ రసం తాగడం వల్ల మలబద్ధక సమస్యను దూరం చేసుకోవచ్చు.

Constipation Problem

Constipation Problem : ఎండాకాలం సాధారణంగా డీహైడ్రేషన్ కారణంగా మలబద్దకం సమస్య ఉత్పన్నం అవుతుంది. మండే వేడి శరీరంలో నీటి నిల్వలను తగ్గిస్తుంది. దీని వల్ల మలం గట్టిగా మారుతుంది. గతంలో ఎన్నడూ మలబద్ధకం సమస్యను ఎదుర్కోని వారు సైతం వేసవిలో ఈ తరహా ఇబ్బందిని చవి చూడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది దీర్ఘాకాలిక సమస్యగా మారే అవకాశం ఉంటుంది. వేసవిలో మలబద్ధకాన్ని నివారించుకునేందుకు కొన్ని రకాల సూచనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంది.

భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. బోజనం చేసిన అరగంట తరువాత ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలి. ఇలా చేయటం వల్ల జీర్ణవ్యవస్ధ శుభ్రపడటంతోపాటు, కడుపులో గ్యాస్ట్రిక్ జ్యూస్ స్రావాలను ప్రేరేపించి మలబద్ధకాన్ని నివారిస్తుంది. అల్లం నీళ్లలో తేనె కలిపి రోజుకు రెండు సార్లు తాగాలి. పేగుకదలికలను ప్రోత్సహించటంలో ఈ నీరు ఎంతో ప్రయోజనాకారిగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధకం నుండి ఉపశమనాన్నికలిగిస్తుంది. శరీరం నుండి వ్యర్ధాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. గోరువెచ్చని నీళ్లలో నిమ్మకాయను పిండడంతోపాటు కొంచెం తేనె కూడా కలిపితే ప్రయోజనం ఉంటుంది. బొప్పాయి పండును తిన‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం స‌మస్య‌లు త‌గ్గుతాయి.

శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచి జీర్ణాశయ పనితీరును మెరుగుపరిచటంలో పుచ్చకాయ బాగా ఉపకరిస్తుంది. ప్రేగు కదలికలను ఇది సులభతరం చేస్తుంది. ముఖ్యంగా వేసవికాలంలో పుచ్చకాయ రసం తాగడం వల్ల మలబద్ధక సమస్యను దూరం చేసుకోవచ్చు. దోసకాయ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంతో పాటు మలబద్దకాన్ని నివారించటంలో సహాయపడుతుంది. ఒక గ్లాస్ వాటర్ లో ఒక స్పూను వాము గింజలను వేసి బాగా మరిగించాలి. వాటిని రాత్రంతా అంతే ఉంచి ఉదయాన్నే తాగాలి. ఈ నీరు పేగుల కదలికలను పెంచటంలో దోహదపడి మలబద్దకాన్ని నివారిస్తాయి. రోజుకు త‌గినంత నీటిని తాగ‌క‌పోయినా మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఏర్ప‌డుతుంది. నీటిని త‌గినంత తాగాలి. నిత్యం కొబ్బ‌రినూనెను ఏదో ఒక ర‌కంగా తీసుకుంటుంటే మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ద్రాక్ష‌లు కూడా జీర్ణ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు చ‌క్క‌గా ప‌నికొస్తాయి. త‌ర‌చూ వీటిని తీసుకోవ‌డం ద్వారా మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించుకోవ‌చ్చు.