అమ్మో.. వెయ్యి కోట్ల మందు తాగేస్తారా!

న్యూ ఇయర్ కౌంట్ డౌన్ మొదలైంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా సెలబ్రేషన్స్ కు అందరూ రెడీ అవుతున్నారు. కుర్రకారుకి పార్టీ అంటే మొదటగా గుర్తొచ్చేది లిక్కర్.

  • Publish Date - December 28, 2018 / 08:25 AM IST

న్యూ ఇయర్ కౌంట్ డౌన్ మొదలైంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా సెలబ్రేషన్స్ కు అందరూ రెడీ అవుతున్నారు. కుర్రకారుకి పార్టీ అంటే మొదటగా గుర్తొచ్చేది లిక్కర్.

హైదరబాద్ : న్యూ ఇయర్ కౌంట్ డౌన్ మొదలైంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా సెలబ్రేషన్స్ కు అందరూ రెడీ అవుతున్నారు. కుర్రకారుకి పార్టీ అంటే మొదటగా గుర్తొచ్చేది లిక్కర్. హయ్యస్ట్ సేల్స్ ఇదే. ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో లిక్కర్ తన హవా కొనసాగించునున్నట్లు అంచనా. హైదరాబాద్ తోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఈసారి న్యూఇయర్ మందు పొంగిపొర్లనుంది. వెయ్యి కోట్ల రూపాయలు అమ్మకాలు సాగనున్నట్లు భావిస్తున్నారు. 2018తో పోల్చుకుంటే ఇది 20-30శాతం అదనం. ఎక్సైజ్ ఖజానాకు కాసుల పంట పడనుంది. కొత్త సంవత్సరానికి కిక్ తో కూడిన మత్తు మజాతో స్వాగతం పలికేందుకు యువతతో పాటు అందరూ రెడీ అయిపోతున్నారు. 
లాంగ్ లెంగ్త్ వీకెండ్.. మత్తెక్కనున్న మందుబాబులు
2019 జనవరి 1వ తేదీ  తెలంగాణ సర్కార్ సెలవు ప్రకటించింది. 2018 సోమవారం రాత్రి ప్రారంభమయ్యే సెలబ్రేషన్స్ ఆదివారం ఎలాగూ హాలిడే.. సోమవారం కూడా సెలవు పెట్టేసుకున్నారు. ఇప్పటికే. మండే హాలిడే చిటీ ఇచ్చేస్తున్నారు. వరసగా మూడు రోజులు వేడుకలకు సిద్ధం అయ్యారు. ఇది కూడా ఎక్సైజ్ శాఖకు కలిసి వచ్చే అంశం. వీకెండ్ లోనే సేల్స్ బాగుంటాయి. అలాంటిది న్యూఇయర్ వస్తున్న మూడు రోజులను సరిగ్గా సద్వినియోగం చేసుకుని.. భారీ సేల్స్ చేసుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా లెక్కేసుకుంటే రూ.1000 కోట్ల లిక్కర్ తో 2018 సంవత్సరంలో లిక్కర్ అమ్మకాలను బ్రేక్ చేసేసేందుకు తెలంగాణ రెడీ అయిపోతోంది.
ఆఫర్స్ ఇచ్చేస్తున్న కిక్ ప్లేసెస్..
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పబ్స్, రిసార్ట్స్ భారీ ఈవెంట్స్ ప్లాన్ చేశాయి. స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నాయి. సింగిల్, కపుల్ ప్యాక్ లు ఇస్తున్నారు. నగరంలోని ప్రముఖ హోటళ్లు‌, రెస్టారెంట్లు‌, కన్వెన్షన్ సెంటర్లు న్యూ ఇయర్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసేందుకు పక్కా ప్లాన్స్‌తో రెడీగా ఉన్నాయి. హైదరాబాద్‌తో సహా ప్రధాన పట్టణాల్లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు న్యూ ఇయర్ వేడుకలను జరుపుకొనేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాయి. సెలబ్రిటీలు, డీజేలు యూత్‌ను హోరెత్తించేందుకు సిద్ధం అయ్యాయి.

మరోవైపు ఫుడ్‌, వైన్‌, మస్తీ అంటూ కాంబో ఆఫర్లు ప్రకటించేశాయి. ఈ ఈవెంట్లలో పాల్గొనేందుకు యువత పోటీ పడుతున్నారు. గతంతో పోల్చుకుంటే ఈ సారి మద్యం ఏరులై పారడం గ్యారెంటీ అనిపిస్తోంది. న్యూఇయర్ సెల్రబేషన్స్ ను దృష్టితో.. వైన్స్, బార్లు, పబ్స్ ఫుల్ స్టాక్ పెట్టుకున్నాయి. ఈ క్రమంలో ఈ సంవ్సతరం అంతకు మించి రూ.1000 కోట్ల టార్గెట్ కు రీచ్ అయ్యే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది.