Cardamom
Cardamom : మన భారతీయ వంటలలో ఉపయోగించే మసాల దినుసులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి మసాల దినుసలలో యాలకులు ఒకటి.. చక్కని రుచి, సువాసన యాలకుల ప్రత్యేకత. స్వీట్స్ తోపాటు, కూరల్లో మసాలా దినుసుగా, టీలలో, జ్యూస్ లలో కూడా దీనిని చాలా మంది వేసుకుంటారు. యాలకులు రుచితోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు యాలకులు చక్కని ఔషదంగా పనిచేస్తాయి. డయాబెటిస్, ఆస్తమా, గుండె సమస్యలకు, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి యాలకులు మేలు చేస్తాయి.
నోటిలోని బ్యాక్టీరియా కారణంగా వచ్చే సమస్యలను, నోటి దుర్వాసనను పోగొట్టటంలో, చిగుళ్ల వ్యాధులను నివారించటంలో యాలకులను మించిందిలేదనే చెప్పవచ్చు. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను యాలకులు కలిగి ఉన్నాయి. జలుబు, దగ్గు సమస్యలతో పాటుగా, ఆందోళన, వికారం వంటి సమస్యలను యాలకులు తగ్గించటంలో మంచి సహాయకారిగా పనిచేస్తాయి. గుండె సమస్య, డయాబెటిస్ సమస్యలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఊబకాయం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి ఉపకరిస్తాయి.
యాలకుల లోపలి గింజలను తీసి మెత్తని పొడిగా చేసి మీగడలో కలిపి తీసుకుంటే నోటి పూత తగ్గిపోతుంది. ఒక మెత్తని క్లాత్ లో వేసి మూట కట్టి వాసన పీల్చుతూ ఉంటే తలనొప్పి తగ్గిపోతుంది. రోజు త్రాగే టీలో యాలకులు వేసుకుంటే మూత్రాశయ సమస్యలు తొలగిపోతాయి. పరగడుపున ఒక అరటి పండులో ఒక యాలుకును ఉంచి దాన్ని అలాగే తినేయాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా 21 రోజుల పాటు తింటూ ఉంటే అర్ష మొలలు తగ్గుతాయి. అంగస్తంభన సమస్యతో బాధపడుతున్న వారు యాలకులు తీసుకుంటే శృంగారసామర్ధ్యం పెరుగుతుంది.
కడుపులో మంట, నొప్పిని పోగొడతాయి. పొట్టలో విడుదలయ్యే బైల్ యాసిడ్‌ను యాలకులు క్రమబద్ధీకరిస్తాయి. యాలకుల్లో మెటబాలిజంను మెరుగుపరిచే ఔషధ గుణాలున్నాయి. ఇవి జీర్ణక్రియను బలపరుస్తాయి. యాలకుల్ని ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యల్ని నయం చేయడానికి ఉపయోగిస్తారు. బీపీని తగ్గించేందుకు యాలకులు బాగా పనిచేస్తాయి. యాలకుల్లో మాంగనీస్ అధికంగా ఉంటుంది. ఇది డయాబెటిస్ ప్రమాదం నుండి రక్షిస్తుంది.