India Coronavirus Updates : భారత్‌లో తగ్గుతున్న కరోనా.. 8 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు

భారత్‌లో కరోనా తగ్గుముఖం పడుతోంది. దేశంలో 73 రోజుల తర్వాత కరోనా యాక్టివ్ కేసులు 8 లక్షల దిగువకు పడిపోయాయి. భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,480 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

India Coronavirus Updates : భారత్‌లో కరోనా తగ్గుముఖం పడుతోంది. దేశంలో 73 రోజుల తర్వాత కరోనా యాక్టివ్ కేసులు 8 లక్షల దిగువకు పడిపోయాయి. భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,480 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 1,587 మంది కరోనాతో మృతి చెందారు. దాంతో దేశంలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 29,762,793 చేరగా.. మరణాల సంఖ్య 383,490కి చేరింది.

గత 24 గంటల్లో దాదాపు 89వేల మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. దాంతో దేశంలో మొత్తం కరోనా రికవరీల సంఖ్య 28,580,647కు చేరింది. అలాగే ప్రస్తుతం 7,98,656 కరోనా యాక్టివ్ కేసులకు పడిపోయాయి. దేశవ్యాప్తంగా కేస్ లోడ్ శాతం 2.78శాతం ఉండగా.. రికవరీ రేటు 96.03 శాతం.. మరణాల రేటు 1.29 శాతంగా నమోదైంది. దేశంలో ఇప్పటివరకు 26.89 కోట్ల మందికిపైగా కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

గడిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 32,59,003 మందికి వ్యాక్సిన్ అందించారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం వ్యాక్సిన్ వేయించుకున్నవారి సంఖ్య 26,89,60,399 కు చేరింది. శుక్రవారం కేసుల సంఖ్య గురువారం కంటే తక్కువగా నమోదైంది. ఈ ఏడాదిలో ఏప్రిల్ 18 నుంచి కరోనా మరణాల సంఖ్య అత్యల్యంగా నమోదైంది. మరోవైపు.. కొవిడ్ థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఉండదని.. చిన్నారులపై ప్రభావం చూపే అవకాశాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (WHO), ఎయిమ్స్ సంయుక్త అధ్యయనంలో పేర్కొంది. కరోనా థ‌ర్డ్ వేవ్ వచ్చినా.. చిన్నారుల్లో ప్రభావం ఉంటుందని ఆందోళన అవసరం లేదని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు