అందరిచూపు ఆక్స్ ఫర్డ్ Astrazeneca వ్యాక్సిన్‌‌వైపే.. నిజంగా కరోనాను అంతం చేయగలదా?

  • Publish Date - July 23, 2020 / 05:26 PM IST

కరోనావైరస్ వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఆశగా ఎదురుచూస్తోంది. కరోనా మహమ్మారి నుంచి వ్యాక్సిన్ రక్షిస్తుందనే గంపెడు ఆశతో జీవిస్తున్నారు. ఇప్పుడు అందరికి ఆశలకు మరింత బలాన్ని ఇస్తోంది ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్. అందరి ప్రశంసలను అందుకుంటోంది.

ఇతర కరోనా వ్యాక్సిన్లు రావడానికి ముందే ఆక్స్ ఫర్డ్ అభివృద్ధి చేసే వ్యాక్సిన్‌పైనే ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్‌పై ఎక్కువగా ఆశలు పెట్టుకోవడం సమంజసమేనా? ఒకవేళ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉంటాయా? లేదా అనేది చూడాలి మరి.. ప్రస్తుతానికి ఆక్స్ ఫర్డ్ Astrazeneca కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి ఏ స్థాయిలో ఉంది? ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో ఓసారి చూద్దాం..
ఆక్స్ ఫర్డ్  టీకాపై ఆశలు పెట్టుకోవడం సరైనదేనా? :
అంటే.. అవుననే చెప్పాలి.. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ-బ్రిటిష్ స్వీడిష్ సంస్థ ఆస్ట్రాజెనెకా దశ I / II COVID-19 వ్యాక్సిన్ డేటా కొన్ని వారాల క్రితమే విడుదలయింది. కరోనా వ్యాక్సిన్ వస్తోందంటూ ప్రపంచమంతా హర్షం వ్యక్తం చేస్తోంది. ఏప్రిల్ చివరలో క్లినికల్ ట్రయల్స్‌ను చేసిన వారిలో ఈ పరిశోధక బృందం ఒకటిగా ఉంది. అప్పటినుంచి టీకా అభివృద్ధి దశలో ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి.
మూడో దశలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ :
ఆక్స్ ఫర్డ్ అభివృద్ధి చేసే వ్యాక్సిన్ ఇప్పటికీ మూడవ దశలో కొనసాగుతోంది. అబ్జర్వేటరీ డేటా నుంచి వచ్చిన ప్రాథమిక ఫలితాల ప్రకారం.. టీకా హోస్ట్ బాడీలలో బలమైన రోగనిరోధక ప్రతిస్పందనతో పాటు ప్రోత్సహకర ఫలితాలను ఇచ్చిందని నిర్ధారించింది. ఆస్ట్రాజెనెకా ఒక బిలియన్ మోతాదులను పంపిణీ ఉత్పత్తిని వేగవంతం చేస్తున్నట్టు ప్రకటించింది. WHO లేటెస్ట్ బ్రీఫింగ్‌లో ఈ అంశాన్ని ప్రశంసించింది. 2021 ముందే వ్యాక్సిన్ వస్తుందనడం అవాస్తవమని అంటున్నారు.

వ్యాక్సిన్ ఇంతకీ సురక్షితమేనా? :
ఇప్పటివరకూ సేకరించినా డేటాను పరిశీలిస్తే.. చాలా ముఖ్యమైన ప్రమాణాలు అవసరమని భావిస్తున్నారు. కొన్ని భద్రతా సమస్యలు ఉన్నాయని అంటున్నారు. 2020లో ముందు టీకా సిద్ధంగా ఉందా? అలాంటప్పుడు ఇంత తొందరగా వ్యాక్సిన్ ఎలా వస్తుందనే ప్రశ్న అందరిలోనూ వ్యక్తమవుతోంది.

ఎక్కువ కాలం రోగనిరోధక శక్తిని అందించగలదా? :
ది లాన్సెట్‌లో ప్రచురించిన డేటా ప్రకారం.. వ్యాక్సిన్ డబుల్ మోతాదును తీసుకున్నవారిలో బలమైన రోగనిరోధకత పెరిగిందని, వారిలో యాంటీ బాడీస్ అభివృద్ధి చెందాయని నిరూపించారు. అయితే, కరోనా వ్యాప్తిని వ్యాక్సిన్.. రోగనిరోధక శక్తిని ఎంతకాలం అందించగలదో ఇంకా స్పష్టత లేదు.

రాబోయే దశాబ్దాల్లోనూ కరోనావైరస్ అలానే ఉండవచ్చని అంటున్నారు. టీకా ఒక ఏడాది మాత్రమే రోగనిరోధక శక్తిని అందించగలదని ఇదివరకే కొన్ని నివేదికలు ఆధారాలను సూచించాయి. లండన్‌లోని కింగ్స్ కాలేజీ చేసిన ఒక ప్రత్యేక అధ్యయనంలో రోగులలో యాంటీబాడీస్ స్థాయి తాత్కాలికంగా వ్యాప్తి నుంచి రోగనిరోధక శక్తిని అందిస్తుందని గుర్తించారు.
ల్యాబరేటరీ ఫలితాలపై పూర్తిగా ఆధారపడవచ్చా? :
ప్రారంభ దశలో ఆధారాలు ప్రోత్సాహకరమైన ఫలితాలను సూచించి ఉండొచ్చు.. దీనిపై చాలా సందేహాలు ఉన్నాయి. ల్యాబరేటరీ ఫలితాలు ఎల్లప్పుడూ వాస్తవ ప్రపంచ ఫలితాలతో పరస్పరం సంబంధం కలిగి ఉండవని గుర్తించాలి. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న టీకాలన్నీ కొత్తవి. కరోనావైరస్ గురించి మనకు తెలిసిన ఆధారాలేమి లేవని గుర్తించాలి. ల్యాబరేటరీల్లో పనిచేసిన వ్యాక్సిన్.. వాస్తవానికి ఏడు బిలియన్ల జనాభాపై పనిచేయకపోవచ్చు.

వ్యాక్సిన్ ఒక చిన్న సమూహానికి పనిచేస్తే.. అందరికీ పనికి రాకపోవచ్చుననే అభిప్రాయాలు లేకపోలేదు. కోతులపై పరిశోధకులు ప్రీ-క్లినికల్ అధ్యయనాలు చేసినప్పుడు.. మానవులు సాధారణంగా ఉండే వైరస్‌ల కంటే ఎక్కువ లోడ్‌కు గురవుతున్నారనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యాక్సిన్‌ను వ్యాధులన్నింటిని నిరోధించగలదని నమ్మడానికి ముందు మరిన్ని పరిశోధనలు అవసరమని పరిశోధకులు
అభిప్రాయపడుతున్నారు.

అధ్యయనం స్థాయి ఇప్పటికీ అస్పష్టమే :
క్లినికల్ ట్రయల్స్ దశ I / II నుంచి దశలను పూర్తి చేసుకుంది. ఇందులో సగం మోతాదు ఇచ్చేశారు.. సగం మందికి ప్లేసిబో ఔషధాన్ని ఇచ్చారు. కొంతమంది వాలంటీర్లపై పరీక్షించిన వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికీ పని చేస్తుందని భావించడం సరైనది కాదు. భద్రత, సమర్థత సమస్యలను తొలగించడానికి మొదటి దశ పరీక్ష జరుగుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ఇతర వ్యాక్సిన్ల కంటే ముందుగానే ఉంది. మోడెర్నా, ఫైజర్, కాన్సినో బయోలాజిక్స్ సహా ఇతర గ్రూపులు కూడా ప్రారంభ దశ ట్రయల్స్ నుంచి డేటాను విడుదల చేశాయి.

అన్ని వయసులవారిలో టీకా పనిచేస్తుందా? :
క్లౌడ్ అబ్జర్వేటరీ డేటా ప్రకారం.. ప్రతి ఒక్కరిలో టీకా పనిచేస్తుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. అధ్యయనం ప్రారంభ దశలో, 18-55 సంవత్సరాల మధ్య ఆరోగ్యకరమైన వాలంటీర్లను ఎంపిక చేశారు. గర్భిణీ స్త్రీలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులను ఈ పరీక్షలకు మినహాయించారు.

టీకా పిల్లలపై కూడా పరీక్షించే అవకాశం ఉందని ముందస్తు నివేదికలు వచ్చాయి. కానీ, దీనిపై స్పష్టత రాలేదు. వ్యాక్సిన్ నిజంగా ప్రభావవంతమైనది, సురక్షితమైనదిగా భావించాలంటే అందరిపై ప్రయోగించాల్సి ఉంటుుంది. అప్పుడే ఈ వ్యాక్సిన్ అన్ని వయస్సుల వారీపై పనిచేస్తుందా లేదా అనేది తెలుస్తుంది.

వ్యాక్సిన్ సరైన మోతాదులో అందరికి అందుతుందా? :
ఆస్ట్రాజెనెకా ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో ఒప్పందాలను కుదుర్చుకుంది. WHO అధిపతి అనేక కంపెనీలు సాధించిన పురోగతిని గుర్తించారు. అయితే 2021 కి ముందు వ్యాక్సిన్‌ను ఆశించడం అవాస్తవమని అన్నారు. వాస్తవికంగా ఈ వ్యాక్సిన్ వచ్చే ఏడాది ఆరంభంలో అందుబాటులోకి రావొచ్చు.

దీనిపై మరింత అధ్యయనం అవసరమని అంటున్నారు. వ్యాక్సిన్ ఎంత తక్కువ ధరకు లభ్యం అవుతుంది.. ప్రజలందరికీ చేరుతుందా? ప్రతిఒక్కరికీ సరసమైన ధరకే లభ్యం అవుతుందా? ఇలాంటి మరెన్నో సందేహాలకు సమాధానం దొరకాల్సిన అవసరం ఉంది.