Childlessness : మీకు ఇంకా పిల్లలు లేరా? ఈ ప్రశ్న అడిగే ముందు .. ఒకసారి ఆలోచించండి

సంతానలేమికి స్త్రీ, పురుషులిద్దరిలోనూ సమస్యలు ఉంటాయి. ఆ జంటలు అర్ధం చేసుకుని జీవితం సాగిస్తున్నా సమాజం నుంచి ఎదురయ్యే ప్రశ్నలు వారిని డిప్రెషన్‌లోకి నెట్టేస్తున్నాయి. సంతానం లేని జంటలు విపరీతమైన స్ట్రెస్‌లో ఉంటున్నారని తెలుస్తోంది.

Childlessness

Childlessness : పిల్లలు కలగని దంపతుల్లో స్ట్రెస్ ఉంటుంది. రకరకాల మూడ్ స్వింగ్స్ లో ఉంటారు. చేయించుకునే ట్రీట్మెంట్స్‌తో పాటు సొసైటీ నుంచి ఎదురయ్యే ప్రశ్నలతో డిప్రెస్ అయిపోతుంటారు. మీకు ఇంకా పిల్లలు లేరా? అనే ప్రశ్న అడిగే ముందు వారి ఇబ్బందులు తెలుసుకోవడం కూడా అవసరం.

పెళ్లైన కొంతకాలానికి ప్రతి జంట ఎదుర్కునే ప్రశ్న.. ఏదైనా గుడ్ న్యూస్ ఉందా? ఇంకొంత కాలం గడిచికా.. పిల్లలు ఇంకా కలగట్లేదా? ఫలానా డాక్టర్ దగ్గరకి వెళ్లండి.. ఇప్పుడే వద్దనుకుంటున్నారా? ఆలస్యం చేస్తే పిల్లలు పుట్టరు.. సొసైటీ నుంచి ఇలాంటి సలహాలు పుట్టుకొస్తాయి. కొందరు జంటల్లో వాయిదా వేసుకోవడం వల్ల కావచ్చు.. లేక ఇతరత్రా సమస్యలు కావచ్చు పిల్లలు ఆలస్యంగా కంటారు. మరికొందరిలో వంధ్యత్వం కారణంగా సంతానం కలగదు. అలాంటి వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతారు. మరీ ముఖ్యంగా మహిళల్లో ఈ స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంటుంది.

Ayurvedic Fertility Supplements : గర్భధారణకు ఆయుర్వేద సంతానోత్పత్తి సప్లిమెంట్స్ తీసుకుంటున్నారా ? ప్రమాదకరమైన ఆరోగ్యసమస్యలు తప్పవా ?

పిల్లలు కలగకపోతే ముఖ్యంగా పరీక్షలన్నీ ఆడవారికే చేయించడం, మగవారిలో కూడా ఉండే లోపాల్ని విస్మరించడం మనం చూస్తుంటాం. ఇక అత్తింటి వారు పిల్లలు పుట్టకపోతే తమ కొడుక్కి వేరే వివాహం చేస్తామని బెదిరించడం ఇతరులతో పోలుస్తూ గొడ్రాలని నిందించడం చేస్తుంటారు. ఇలాంటివి మహిళల్లో విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తాయి. దాంతో డిప్రెషన్ లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతో హార్మోన్ల అసమతుల్యత పెరిగిపోయి వారిలో అండం ఆలస్యంగా విడుదల కావడం లేదంటే పూర్తిగా కాకపోవడం వంటివి జరుగుతుంటాయి. తాజాగా పిల్లలు పుట్టని దంపతులు సమాజం నుంచి ఎదుర్కుంటున్న స్ట్రెస్ గురించి ప్రముఖ సింగర్ గీతా మాధురి ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు.

పిల్లలు కలగని 5 జంటలు సమాజం నుంచి ఎదుర్కుంటున్న స్ట్రెస్‌ను తను చూసానని గీతా మాధురి చెప్పారు. ఓవైపు పిల్లలు ఇంకా కలగలేదనే స్ట్రెస్‌తో పాటు సొసైటీ ఏమనుకుంటుందో అనే టెన్షన్ వారిలో చాలా కనిపించిందని ఆమె అన్నారు. పిల్లలు ఆలస్యమైన దంపతులు సొసైటీ ఏమనుకుంటుందో అనే ఆలోచన వదిలేసి సంతోషంగా ఉండాలని ఆమె సూచించారు. అలాగే వారిని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగద్దని కూడా ఆమె అందరికి సలహా ఇచ్చారు.

Health: సంతానలేమికి ఐవీఎఫ్‌.. సరైన ఫలితాలు రావాలంటే?

నిజానికి వంధ్యత్వం సమస్యలు లేని వారిలో కూడా ఫెర్టిలిటీ సమస్యలు ఉంటాయి. హెల్దీగా ఉన్నవారు కూడా సమయానికి గర్భం ధరించలేరు. కేవలం మహిళల్లో మాత్రమే వంధ్యత్వం అనేది అపోహ మాత్రమే. పిల్లలు పుట్టడానికి అనేక మార్గాల్లో ప్రయత్నించినా చివరికి  విఫలమైతే జీవితంలో ఇతర విషయాల్లో సంతోషాన్ని వెతుక్కుని గడపడం ఉత్తమమైన మార్గం. సొసైటీ వారిని పదే పదే ప్రశ్నించకుండా ఉంటే ఏ జంటకైనా ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నప్పుడు వంధ్యత్వం అనేది సమస్య కానే కాదు.