Children COVID-19 Vaccine : 12-15ఏళ్ల మధ్య పిల్లలకు కరోనా టీకా వచ్చేసింది..

కరోనావైరస్ మహమ్మారితో పోరాడుతున్న ప్రపంచానికి గుడ్ న్యూస్.. పిల్లలకు కూడా కరోనా టీకా వచ్చేసింది. ఇప్పటివరకూ 18ఏళ్ల నుంచి 45ఏళ్లకు పైబడినవారికి మాత్రమే అందుబాటులోకి వచ్చిన కరోనా టీకా..

Children COVID-19 vaccinations : కరోనావైరస్ మహమ్మారితో పోరాడుతున్న ప్రపంచానికి గుడ్ న్యూస్.. పిల్లలకు కూడా కరోనా టీకా వచ్చేసింది. ఇప్పటివరకూ 18ఏళ్ల నుంచి 45ఏళ్లకు పైబడినవారికి మాత్రమే అందుబాటులోకి వచ్చిన కరోనా టీకా.. చిన్నపిల్లల్లో 12ఏళ్ల నుంచి 15ఏళ్ల మధ్య పిల్లలకు కూడా అందుబాటులోకి వచ్చింది.

ఫైజర్‌- ఎన్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 వ్యాక్సిన్‌కు అమెరికాలో అత్యవసర వినియోగానికి ఆమోదం లభించింది. ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) పిల్లల్లో టీకా అనుమతి ఇచ్చింది. మహమ్మారికి వ్యతిరేక పోరాటంలో ఇదో కీలకమైన దశగా ఎఫ్‌డీఏ కమిషన్‌ జానెట్‌ వుడ్‌కాక్‌ తెలిపారు.

కరోనా టీకా పిల్లలకు కూడా అందుబాటులోకి రావడంతో మహమ్మారి అంతం ఆరంభమైనట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎఫ్‌డీఏ అమెరికాలో 16 ఏళ్లు పైబడిన వారికి ఫైజర్‌ వ్యాక్సిన్‌ వేసేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాలో గతేడాది మార్చి నుంచి 2021 ఏప్రిల్ 30వ తేదీ వరకు 11-17 ఏళ్ల మధ్య వయసున్న 1.5 మిలియన్ల మంది కరోనా బారినపడ్డారు.

ఫైజర్‌ కంపెనీ 12-15 మధ్య ఏళ్ల పిల్లల్లో రెండువేల మందికిపైగా క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించింది. ఇందులో వ్యాక్సిన్‌ సమర్థవంతంగా పనిచేసినట్లు వెల్లడించింది. కెనడాలో కూడా పిల్లలకు ఫైజర్‌ వ్యాక్సిన్‌ వేసేందుకు అనుమతి లభించింది.

ట్రెండింగ్ వార్తలు