Water Covid Spread : కరోనా నీళ్ల ద్వారా వ్యాపించదు.. ఎందుకో తెలుసా?

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనావైరస్ మహమ్మారి నీళ్ల ద్వారా వ్యాపించదని తేలింది. గాలిద్వారా మాత్రమే ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోందని, నీళ్ల ద్వారా మాత్రం వ్యాపించదని కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సాంకేతిక సలహాదారు విజయ రాఘవన్ వెల్లడించారు.

Water Covid Spread : ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనావైరస్ మహమ్మారి నీళ్ల ద్వారా వ్యాపించదని తేలింది. గాలిద్వారా మాత్రమే ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోందని, నీళ్ల ద్వారా మాత్రం వ్యాపించదని కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సాంకేతిక సలహాదారు విజయ రాఘవన్ వెల్లడించారు. వైరస్ నీళ్లలో ఉంటే అది వెంటనే నీరుగారి పోతుందని తెలిపారు. చాలామందిలో కరోనా నీళ్ల ద్వారా వ్యాపిస్తుందని భయాందోళన చెందుతున్నారు. అలాంటి భయమేమీ అవసరం లేదన్నారు.

యూపీలో కరోనాతో చనిపోయిన కరోనా మృతదేహాలను యుమునా నదిలో పడేస్తున్నారు. అయితే ఆ నీటి నుంచి కరోనా వ్యాపిస్తుందేమనని అక్కడి స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తలెత్తిన ప్రశ్నలకు రాఘవన్ వివరణ ఇచ్చారు. నీళ్ల ద్వారా వైరస్ వ్యాప్తిచెందే పరిస్థితి లేదన్నారు. కేవలం గాలిద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తిచెందుతని చెప్పారు. ఎదురెదురుగా మాట్లాడే వ్యక్తుల్లో వెలువడే నోటి తుంపర్ల ద్వారా వైరస్ ఎక్కువగా వ్యాపిస్తోందన్నారు.

గాలిలో వైరస్ చేరగానే.. వీచే గాలి తీవ్రతపై ఆధారపడి ఉంటుందన్నారు. గాలివేగం ఎటు ఉంటే అటుగా వైరస్ వ్యాపించే అవకాశం ఉందంటున్నారు. మూసివేసిన గదుల్లో గోడల మధ్య వైరస్ ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది. అదే తలుపులు తెరిస్తే వెంటనే వైరస్ కిందకి పడిపోతుంది.. వైరస్ గాలిలోకి ప్రవేశించగానే.. అది ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి మధ్య ఆరు మీటర్ల దూరం వరకు వ్యాపించగలదని అంటున్నారు. అందుకే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించడంతో పాటు సామాజిక దూరాన్ని పాటించడం ఎంతో సురక్షితమని చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు