COVID-19 Infection : కరోనాతో గుండె దెబ్బతింటోంది.. కుడివైపు భాగంపై తీవ్రప్రభావం..!

COVID-19 Infection : కరోనా మహమ్మారితో ప్రపంచమంతా అల్లాడిపోయింది. కరోనాతో మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనావైరస్ సోకిన తర్వాత కోలుకున్నప్పటికీ కూడా వైరస్ ప్రభావం కొన్నాళ్లపాటు ఉంటోంది.

COVID-19 Infection : కరోనా మహమ్మారితో ప్రపంచమంతా అల్లాడిపోయింది. కరోనాతో మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనావైరస్ సోకిన తర్వాత కోలుకున్నప్పటికీ కూడా వైరస్ ప్రభావం కొన్నాళ్లపాటు ఉంటోంది. కరోనా ప్రభావిత సైడ్ ఎఫెక్ట్స్ అధికంగా ఉంటున్నాయి. శరీరంలో ఏదో ఒక అవయంపై ప్రభావం చూపిస్తున్నాయి. కరోనా సోకిన వ్యక్తుల్లో ఎక్కువగా ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అలాగే గుండెపనితీరు కూడా దెబ్బతింటోందని తాజా అధ్యయనంలో తేలింది. స్కాట్లాండ్‌లోని ఇంటెన్సివ్ కేర్ రోగులపై చేసిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. COVID-19కి కారణమయ్యే SARS-CoV-2 వైరస్‌.. గుండెలోని కుడి వైపు భాగానికి ఇన్ఫెక్షన్ సోకవడం ద్వారా దాని పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతోందని అధ్యయనంలో తేలింది.

Covid 19 Infection Linked To Impaired Heart Function Study

NHS గోల్డెన్ జూబ్లీ స్కాట్లాండ్‌లోని గ్లాస్గో యూనివర్శిటీ పరిశోధకులు.. కరోనా బాధితుల ప్రాణాలను కాపాడటమే కాకుండా ప్రాణాంతక గుండె, ఊపిరితిత్తుల సమస్యల సంరక్షణపై అధ్యయనం చేసినట్టు పేర్కొన్నారు. ఈ కోవిడ్-RV అధ్యయనంలో భాగంగా.. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నవారిలో భవిష్యత్తులో వారిని వైరస్ బారినుంచి రక్షించడమే లక్ష్యంగా అధ్యయనం కొనసాగింది.

ఇన్వాసివ్ వెంటిలేషన్ అవసరమయ్యే బాధితులపై వైరస్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేదానిపై అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా సోట్‌లాండ్‌లోని 10 ఐసియులలో వెంటిలేటర్‌లపై తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న 121 మంది రోగులను పరీక్షించారు. అధ్యయనంలో సుమారు ముగ్గురు బాధితుల్లో ఒకరికి గుండె కుడి వైపున ఊపిరితిత్తులకు రక్తాన్ని పంపింగ్ చేసే ప్రాంతంలో తీవ్రంగా దెబ్బతిన్నట్టు గుర్తించారు.

Read Also : Heart : గుండె సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

ట్రెండింగ్ వార్తలు