Covid 19 Pandemic Baby Fertility Clinics Report Spike In Egg Freezing
Fertility clinics report spike in egg freezing : కరోనా కాలంలో సంతానోత్పత్తి కోసం ఎగ్ ఫ్రీజింగ్ డిమాండ్ పెరిగిపోయింది. మహమ్మారి సమయంలో పిల్లలు కనేందుకు ఇష్టపడటం లేదు. ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నారు. సంతానోత్పత్తి సంరక్షణ పద్ధతి చికిత్సల వైపు పరుగులు పెడుతున్నారు. ఇటీవల కాలంలో ‘ఎగ్ ఫ్రీజింగ్’ ట్రీట్ మెంట్ లకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. వయస్సులో ఉన్నప్పుడే పురుషులు తమ వీర్యాన్ని సేకరించి శీతలీకరణ పద్ధతిలో నిల్వ చేస్తున్నారు.
ఇలా స్టోర్ చేసిన ఎగ్ ద్వారా భవిష్యత్తులో ఎప్పుడంటే అప్పుడు పిల్లలు కనేందుకు ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ఇప్పుడు మహిళల అండాలను కూడా శీతలీకరణ పద్ధతిలో నిల్వ చేస్తున్నారు. ఇండియాలో ఫెర్టిలిటీ ట్రీట్ మెంట్లకు భారీ డిమాండ్ పెరిగిపోయింది. 30 ఏళ్లు దాటక ముందే విడుదలయ్యే అండాలను నిల్వ చేస్తున్నారు. 35 ఏళ్లు దాటాక గర్భం ధరించాలంటే అండోత్పత్తి తగ్గిపోతుంది. అందుకే పెళ్లయిన వెంటనే అండాలను నిల్వ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
కరోనా కాలంలో జననాల రేటు గణనీయంగా తగ్గడానికి ఇదే ప్రధాన కారణమని ఫెర్టిలిటీ నిపుణులు అంటున్నారు. ఇండియాలో సామాన్యుల కంటే సెలబ్రిటీలే ఎక్కువగా ఈ ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతిని అనుసరిస్తున్నారు. దేశంలో ప్రతిచోట అండాలను నిల్వ చేసేందుకు ఐవీఎఫ్ సెంటర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాదిలో సంతానోత్పత్తి చికిత్సలు పెరిగిపోయాయి. దాంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో జనన రేట్లు సాధారణం కంటే గణనీయంగా తగ్గినట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ క్లినిక్‌లు సైతం ఎగ్ ఫ్రీజింగ్ ఇతర సంతానోత్పత్తి చికిత్సల వైపు కొత్త రోగుల సంఖ్య ఇటీవలి నెలల్లో పెరిగిందని చెప్పారు. మహమ్మారి సమయంలో కాలిఫోర్నియా న్యూజెర్సీలో అనేక ఫెర్టిలిటీ క్లినిక్‌ల్లో ‘ఎగ్ ఫ్రీజింగ్’ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) గణనీయమైన వృద్ధిని సాధించాయి. యుఎస్ చిలీలో జూన్ నుంచి నవంబర్ 2020 మధ్య ఎగ్ ఫ్రీజింగ్ 50శాతం పెరిగింది. బోస్టన్ లో IVF సాధారణ ఎంక్వైరీల్లో 40శాతం పెరగగా.. మహమ్మారి సమయంలో ఫెర్టిలిటీ ట్రీట్ మెంట్లలో 30శాతం పెరిగినట్టు నివేదిక వెల్లడించింది.