Covid-19 Tests : కరెక్ట్ రిజల్ట్ రావాలంటే.. కరోనా టెస్టుకు మధ్యాహ్నమే బెస్ట్ టైమ్!

కరోనా టెస్టును మధ్యాహ్నం సమయంలోనే చేయించుకోవాలంట.. అప్పుడే సరైన ఫలితాలు వస్తాయంటోంది కొత్త స్టడీ. మధ్యాహ్నం వేళ కరోనా టెస్టు చేయించుకుంటే ఫాల్స్ నెగటివ్ రిజల్ట్స్ రావడానికి తక్కువ అవకాశాలు ఉంటాయని తేలింది.

Early afternoon Best Time for Covid-19 tests  : ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతోంది. మొన్నటివరకూ తగ్గినట్టే తగ్గి మళ్లీ కరోనా కోరలు చాస్తోంది. కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తే తప్పా కరోనా వచ్చిన విషయం కూడా తెలియడం లేదు. లక్షణ రహిత కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా పరీక్షలు తప్పక చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఒక్కోసారి కరోనా పరీక్షలు చేయించుకున్నా తప్పుడు రిజల్ట్ వస్తున్నాయి..

కరోనా ఉన్నా లేదని నెగటివ్ చూపించడం.. కరోనా లేకపోయినా ఉందని రావడం.. వంటివి మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాయి. అందుకే కరోనా టెస్టు ఎప్పుడు చేయించుకోవాలి? ఏ సమయంలో టెస్టు చేయించుకుంటే కరెక్టుగా వస్తుందో కొత్త అధ్యయనం వెల్లడించింది. కరోనా టెస్టును మధ్యాహ్నం సమయంలోనే చేయించుకోవాలంట.. అప్పుడే కరోనా నిర్ధారణ పరీక్షలో సరైన ఫలితాలు వస్తాయని అంటోంది. అంటే.. మధ్యాహ్నం ప్రారంభమయ్యే సమయంలో కరోనా టెస్టు చేయించుకుంటే ఫాల్స్ నెగటివ్ రిజల్ట్స్ రావడానికి తక్కువ అవకాశాలు ఉంటాయని తేలింది. రోజులో మిగతా సమయాల్లో కంటే ఇదే బెటర్ టైమ్ అంటున్నారు రీసెర్చర్లు.

నాష్ విల్లే ఏరియాలో గత ఏడాదిలో మార్చి, జూన్ మధ్యకాలంలో 30వేల వరకు పీసీఆర్ ఆధారిత టెస్టులను నిర్వహించారు. 24 గంటల వ్యవధిలో మధ్యాహ్నాం 2 గంటల సమయం వరకు కరోనా టెస్టుల్లో పాజిటివ్ రిజల్ట్స్ రెట్టింపుగా నమోదయ్యాయని కనుగొన్నారు. ఒక రోజులో వేర్వేరు సమయాల్లో వివిధ గ్రూపులవారికి కరోనా టెస్టులు చేశారు. వారిలో మధ్యాహ్నం సమయంలో టెస్టు చేయించుకున్నవారిలో సరైన రిజల్ట్స్ కనిపించాయని గుర్తించారు. కరోనా సోకినవారిలో వైరస్ లక్షణాలు 24 గంటల వ్యవధిలో మారవచ్చునని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు