ఫార్మసీల్లోనూ కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి.. ఎప్పుడంటే?

Covid-19 Vaccine Available Pharmacies : దేశంలో కరోనా వ్యాక్సిన్లు వచ్చే ఏడాది 2021 రెండో త్రైమాసికం నాటికి అందబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ల సంఖ్యను బట్టి టీకాలు ప్రజలకు అందుబాటులోకి రావొచ్చు. వ్యాక్సిన్లకు ఆమోదం లభించిన వెంటనే వచ్చే ఏడాది ప్రారంభంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవుతుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత జనాభాలో టీకాలకు చెల్లించగలిగేవారికి ప్రైవేటు వినియోగం కోసం షాట్లను అందుబాటులో ఉంచాలని డ్రగ్ మేకర్లు భావిస్తున్నారు.

ప్రైవేట్ మార్కెట్లలో టీకా ధరలకు సబ్సిడీ ఇవ్వవచ్చు అని పేరు చెప్పేందుకు నిరాకరించిన ఒక నిపుణులు తెలిపారు. అయితే, కోవిడ్ -19 వ్యాక్సిన్ అభ్యర్థులకు రెగ్యులేటరీ ఆమోదాలు పొందడానికి లోబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఫార్మసీ వంటి ప్రైవేట్ మార్కెట్లో వ్యాక్సిన్‌ను యాక్సెస్ చేయడానికి అనుమతించడం జరుగుతుందని తెలిపారు. వచ్చే ఏడాది జూలై నాటికి కనీసం 300 మిలియన్ల మంది అధిక ప్రమాదం ఉన్నవారికి వ్యాక్సిన్ వేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ప్రస్తుతం మొదటి దశకు సుమారు 30 మిలియన్ల ఆరోగ్య సంరక్షణ ఫ్రంట్‌లైన్ కార్మికుల లబ్ధిదారుల జాబితాను రూపొందిస్తోంది.

ప్రస్తుతం, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో తయారు చేస్తున్న ఫైజర్-బయోఎంటెక్ ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అనే రెండు వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ డేటాను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) పరిశీలిస్తోంది. ఢిల్లీలోని AIIMS డైరెక్టర్ ప్రకారం.. ఈ ఏడాది చివరినాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో వ్యాక్సిన్ వినియోగానికి EUA మంజూరు చేసే అవకాశం ఉంది. వ్యాక్సిన్ వినియోగానికి అవసరమైన రెగ్యులేటరీ ఆమోదాలు ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో వచ్చే అవకాశం ఉందని డాక్టర్ గులేరియా చెప్పారు.