Covid 3rd Wave : పిల్లలపైనే ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువ.. ఎందుకంటే? నిపుణుల మాటల్లోనే..!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పుడు ప్రపంచాన్ని కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ కలవరపెడుతోంది.

Covid 3rd Wave : ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పుడు ప్రపంచాన్ని కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ కలవరపెడుతోంది. కరోనా థర్డ్‌ వేవ్‌ తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. ఒమిక్రాన్‌ వ్యాప్తి మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో థర్డ్‌వేవ్‌ మొదలైంది. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతోంది. కరోనా కట్టడి కోసం ప్రపంచ దేశాలు తప్పనిసరి పరిస్థితుల్లో ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ కొత్త వేరియంట్‌ ప్రభావం పిల్లలపై అధికంగా ఉంటుందనే విషయమ మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా మొదటి, రెండు వేవ్ సమయంలో పిల్లలపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఇప్పుడు కరోనా థర్డ్‌వేవ్‌ మరింతగా ప్రభావం చూపే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఢిల్లీ ఎయిమ్స్‌ నిర్వహించిన సెమినార్‌లో ఎయిమ్స్‌ పీడీయాట్రరి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ హెడ్‌ ప్రొఫెస్‌ డాక్టర్‌ రాకేష్‌ లోధా అనేక విషయాలపై మాట్లాడారు. ఒమిక్రాన్‌ అత్యంత వేగంగా ఒకరినుంచి మరొకరికి వ్యాప్తి చెందుతోందని వైద్యులు చెబుతున్నారు. లక్షణాల తీవ్రత కూడా పిల్లల్లో అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కరోనా వ్యాప్తిపై ప్రజల్లో అవగాహన లేకపోవడం.. దానికితోడు నిర్లక్ష్యంగా వ్యవహరించేవారితో వైరస్ వ్యాప్తి పెరిగిపోతుందని అంటున్నారు. కొవిడ్ నిబంధలను పాటించకపోవడం, మాస్క్ లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం కూడా ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.

ఆర్ వాల్యూ పెరిగిపోవడం వల్ల పిల్లలపై వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని చెబుతున్నారు. అమెరికాలో కరోనాతో పిల్లలు ఆస్పత్రుల్లో చేరుతున్న సంఖ్య పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. సాధారణంగా పిల్లల్లో కరోనా లక్షణాల్లో ఎక్కువగా కనిపించే వాటిలో గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, శ్వాస సమస్యలు, ఛాతి నొప్పితో పాటు ముఖం వాపు వంటి లక్షణలు ఉంటున్నాయని నిపుణులు వెల్లడించారు.

Read Also : Kerala Schools : కేరళలో కరోనా విలయం.. 9వ తరగతి వరకు స్కూళ్లు మూసివేత! 

ట్రెండింగ్ వార్తలు