Covid Antibodies: కరోనా నుంచి కోలుకున్నాక యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయి.. తేల్చేసిన సైంటిస్టులు

కరోనా బారినపడి చికిత్స అనంతరం కోలుకున్న చాలామందిలో యాంటీబాడీలు తయారవుతాయని అంటుంటారు. అయితే ఆ కొవిడ్ యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయో సైంటిస్టులు తేల్చేశారు.

Covid Antibodies : కరోనా బారినపడి చికిత్స అనంతరం కోలుకున్న చాలామందిలో యాంటీబాడీలు తయారవుతాయని అంటుంటారు. అయితే ఆ కొవిడ్ యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయో సైంటిస్టులు తేల్చేశారు. కరోనా నుంచి కోలుకున్నవారిలో యాంటీబాడీలు తయారైనప్పటినుంచి కనీసం 6 నుంచి 8 నెలలు ఉంటాయని ఇటలీ సైంటిస్టులు తేల్చేశారు. కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత, వారి వయసు, ఇతర అనారోగ్య సమస్యలతో కరోనా యాంటీబాడీలకు సంబంధం ఉండదని అంటున్నారు.

గత ఏడాది కొవిడ్‌-19 మొదటి వేవ్ పెరిగిన సమయంలో మిలాన్‌లోని ఆస్పత్రిలో చేరిన 162 మంది కరోనా బాధితులపై సైంటిస్టులు పరిశోధనలు చేశారు. గత ఏడాది మార్చి, ఏప్రిల్‌లో కొవిడ్ సోకిన వారినుంచి రక్త నమూనాలు సేకరించారు. నవంబరు లో కూడా మరోసారి రక్త నమూనాలను సేకరించి పరీక్షించారు. కరోనా వైరస్‌ను అంతం చేసే యాంటీబాడీలు క్రమంగా తగ్గుతున్నట్టు సైంటిస్టులు గుర్తించారు.

వ్యాధి సోకిన 8 నెలల తర్వాత కూడా యాంటీబాడీలు కనుమరుగైపోతాయని అంటున్నారు. కరోనా సోకినవారిలో 15 రోజుల్లోగా యాంటీబాడీలు తయారుకాకపోతే.. అలాంటి వారిలో కరోనా తీవ్రంగా ఉంటుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. వీరికి తక్షణ వైద్యసాయంతో పాటు నిరంతర పర్యవేక్షణ అవసరమని సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు