Black Fungus : కరోనా నుంచి కోలుకున్న వారిలో కొత్త వ్యాధి.. లక్షణాలివే.. !

కరోనా నుంచి కోలుకున్నామని ఊపిరిపీల్చుకుంటున్నారా? అయితే మరో సమస్య పొంచి ఉంది జాగ్రత్త అంటున్నారు వైద్యనిపుణులు. వైరస్‌ నుంచి కోలుకున్న వారిలో కొందరు ఓ కొత్త వ్యాధికి గురవుతున్నారు.

Covid Cured Patients Black Fungus : కరోనా నుంచి కోలుకున్నామని ఊపిరిపీల్చుకుంటున్నారా? అయితే మరో సమస్య పొంచి ఉంది జాగ్రత్త అంటున్నారు వైద్యనిపుణులు. వైరస్‌ నుంచి కోలుకున్న వారిలో కొందరు ఓ కొత్త వ్యాధికి గురవుతున్నారు. అంతేకాదు.. కొత్త జబ్బుతో మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మ్యుకోర్‌మైకోసిస్‌ లేదా బ్లాక్‌ ఫంగస్‌ అనే ఈ వ్యాధి ఆందోళనకు గురిచేస్తోంది. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లలో కోవిడ్‌ నుంచి కోలుకున్న రోగులు కొందరిలో ఈ బ్లాక్‌ ఫంగస్‌ ఉందని బయటపడింది. ఈ ఫంగస్ లక్షణాలు కొంచెం భయాందోళన కలిగించేలా ఉంది. కరోనావైరస్ మాదిరిగా ఈ వైరస్ అంటువ్యాధి కాదని, వీలైనంత త్వరగా గుర్తించడం ద్వారా మందులతోనే అధిగమించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. వాతావరణంలో ఉండే మ్యుకోర్‌మైకోసిస్‌ అనే శిలీంద్రానికి గాలిద్వారా వ్యాపించే కోవిడ్‌–19తో సంబంధం ఉన్నట్లు నిపుణులు వెల్లడించారు. గత ఏడాది కోవిడ్‌–19 తొలి దశలోనే కొన్నిచోట్ల గుర్తించారు.

ఈ బ్లాక్ ఫంగస్.. కోవిడ్‌–19 నుంచి కోలుకున్న వారికి సోకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. మధుమేహం, మూత్రపిండాల సమస్యలు, కేన్సర్‌లతో కోవిడ్‌–19కి గురైతే సమస్య మరింత తీవ్రమవుతుంది. అవయవ మార్పిడి, స్టెరాయిడ్లు వాడుతున్న వారికీ ఈ శిలీంద్రంతో ముప్పు అధికంగా ఉంటుందని తేలింది. డయాబెటిస్ బాధితుల్లోనూ ఎక్కువ కనిపిస్తుంది. ఫంగస్‌ సోకినట్టు నిర్ధారణ చేయాలంటే తప్పనిసరిగా ఎమ్మారై స్కాన్‌ చేయాల్సి ఉంటుంది.

మ్యుకోర్‌మైకోసిస్‌ను సకాలంలో గుర్తించకపోయినా, చికిత్స అందకపోతే.. అంధత్వం రావొచ్చు. ముక్కు, దవడ ఎముకలు తొలిగించాల్సి ఉంటుంది. మరణం కూడా సంభవించే ప్రమాదం ఉందంటన్నారు. గుజరాత్‌లోని సూరత్‌ నగరంలో బ్లాక్‌ఫంగస్‌ సోకిన సుమారు యాభై మందికి చికిత్స అందించారు. ఈ వ్యాధి బారిన పడ్డ వారిలో ఏడుగురు చూపు కోల్పోయినట్లు తెలిసింది. బ్లాక్ ఫంగస్ లక్షణాల్లో సాధారణ లక్షణాల్లో ముఖం ఒకవైపు వాపు కనిపిస్తుంది. తలనొప్పి, ముక్కుదిబ్బడ, ముక్కు పైభాగంలో లేదా నోటి లోపలి భాగంలో నల్లటి కురుపులు వస్తాయి. జ్వరం, దృష్టి లోపం, కళ్ల కింద నొప్పి వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు