Covid Is Airborne : కొవిడ్ గాల్లోనూ వ్యాపిస్తోంది.. వెంటిలేషన్ ఒక్కటే తీవ్రతను తగ్గించగలదు..

కరోనావైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని మరోసారి రుజువైంది. ఇప్పటికే ఈ విషయంలో అంతర్జాతీయ పరిశోధకులు వాదిస్తున్నప్పటికీ అధికారులు అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు గాల్లో వైరస్ వ్యాప్తి చెందుతుందని సైంటిఫిక్ ఆధారాలు చూపిస్తున్నారు పరిశోధకులు.

Covid Airborne-Scientists ventilation : కరోనావైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని మరోసారి రుజువైంది. ఇప్పటికే ఈ విషయంలో అంతర్జాతీయ పరిశోధకులు వాదిస్తున్నప్పటికీ అధికారులు అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు గాల్లో వైరస్ వ్యాప్తి చెందుతుందని సైంటిఫిక్ ఆధారాలు చూపిస్తున్నారు పరిశోధకులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కూడా ఈ విషయంలో తమ అంగీకారాన్ని తెలిపాయి.

1800 సంవత్సరంలో కలరా వ్యాపించినప్పుడు కూడా ఫెటిడ్ పైపుల్లో నీటి సరఫరా మాదిరిగానే వెంటిలేషన్ వ్యవస్థలను సరిచేయాలని శాస్త్రవేత్తలు పిలుపునిస్తున్నారు. ఇండోర్ లో ఉండే గాలి కేవలం మహమ్మారితో పోరాడలేదని చెబుతున్నారు. ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందన్నారు. ఇండోర్‌లోని సూక్ష్మక్రిములను నివారించేందుకు భవనాలలో వెంటిలేషన్, ఫిల్టర్ అప్‌గ్రేడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.


ఇండోర్ వెంటిలేషన్ వ్యవస్థలను మెరుగుపరచడం ద్వారా అంటువ్యాధులను నివారించవచ్చని 14 దేశాలకు చెందిన 39 మంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాయుమార్గాన వ్యాపించే వైరస్ కారకాలను నిరోధించడానికి ఇండోర్ వాయు నాణ్యత మార్గదర్శకాలను విస్తరించాలని WHO సూచిస్తోంది. వెంటిలేషన్ ప్రమాణాలను రూపొందించాలని సూచిస్తోంది.

SARS-CoV-2 శ్వాసకోశంలో శ్వాస ద్వారా, మాట్లాడటం, పాడటం, దగ్గు, తుమ్ము సమయంలో సోకిన వ్యక్తి ముక్కు గొంతు నుంచి విడుదలవుతుంది. అనేక కణాల రూపంలో వ్యాప్తి చెందుతుంది. ఉమ్మినప్పుడు అతిపెద్ద కణాలు వేగంగా కిందికి పడిపోతాయి. భూమి ఉపరితలాలపై ఉండిపోతాయి. అతిచిన్న కంటికి కనిపించని ఏరోసోల్స్ మాత్రం తేమ, ఉష్ణోగ్రత, వాయు ప్రవాహాన్ని బట్టి ఎక్కువ దూరం గాల్లో ప్రయాణిస్తాయి. ఏరోసోల్ కణాలు.. గంటల పాటు ఆలస్యంగా గాల్లోనే ఉంటాయి. ఇంటి లోపల ప్రయాణించగలవు. గత జూలైలో 239 మంది శాస్త్రవేత్తలు సూచించిన ప్రకారం.. వెంటిలేషన్ పెంచడంతో పాటు భవనాలలో వైరస్ నిండిన గాలిని పునర్వినియోగపరచడం వంటి అదనపు జాగ్రత్తలు అవసరమని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు