Covid Vaccine Efficacy : ఒమిక్రాన్‌పై కరోనా వ్యాక్సిన్ యాంటీబాడీల రక్షణ తక్కువే.. అధ్యయనంలో వెల్లడి!

కరోనా వ్యాక్సిన్లు పూర్తి స్థాయిలో యాంటీబాడీలతో ఒమిక్రాన్ నుంచి రక్షణ కల్పించలేవని కొత్త అధ్యయనంలో తేలింది. టీకాలు తీసుకున్న ఆస్ట్రియన్ జనాభాలో యాంటీబాడీల స్థితిపై అధ్యయనం చేశారు.

Covid Vaccine Efficacy : ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి ప్రభావం తగ్గుతోంది. చాలావరకూ కరోనా తీవ్రత తగ్గినట్టే కనిపిస్తోంది. కరోనా ఆరంభంలో SARS-CoV-2 virus తో విరుచుకుపడి.. ఆ తర్వాత అనేక కొత్త వేరియంట్లతో ప్రపంచ దేశాలను బెంబేలిత్తించింది. మొన్నటివరకూ కరోనా కేసులతో అల్లాడిపోయిన ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. కరోనా విజృంభణ సమయంలో కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో దాదాపుగా కరోనా తీవ్రత తగ్గిందనే చెప్పాలి. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులతో కరోనా తీవ్ర అనారోగ్య సమస్య నుంచి బయటపడొచ్చునని ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది.

కొన్ని నెలల క్రితం ప్రపంచ దేశాలను వణికించిన దక్షిణాఫ్రికాలో కనిపించిన ఒమిక్రాన్ వైరస్ (Omicron Virus)  భారత్ సహా ప్రపంచాన్ని వణికించింది. ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) ప్రభావం కూడా క్రమంగా తగ్గుముఖం పట్టింది. కరోనా కొత్త కేసులు కూడా తగ్గిపోయాయి. కరోనా మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపించింది. మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ వైరస్ ప్రభావం అధికంగానే ఉంది. అంతేకాదు.. ప్రస్తుత కరోనా వ్యాక్సిన్లు కూడా పూర్తి స్థాయిలో యాంటీబాడీలతో ఒమిక్రాన్ నుంచి రక్షణ కల్పించలేవని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. మూడవ లేదా బూస్టర్ డోస్‌తో టీకాలు వేసిన వ్యక్తుల్లో మాత్రమే ఒమిక్రాన్‌ను పాక్షికంగా నిరోధించగల యాంటీబాడీలు తయారవుతాయని కనుగొన్నారు. ఆస్ట్రియన్ జనాభాలో టీకాలను పొందిన వ్యక్తులపై పరిశోధకులు అధ్యయనం చేశారు.

Covid Vaccine Efficacy Covid Vaccine Efficacy Limited Against Omicron, Says Study

అందులో వుహాన్, డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్‌లపై టీకాలు ఎంతవరకు రక్షణ కల్పిస్తాయో పరిశీలించారు. ఒమిక్రాన్ సహా మునుపటి వేరియంట్లపై అధ్యయనం చేశారు. కణాలపై ACE2 గ్రాహకం ద్వారా మానవ కణాలలోకి ప్రవేశించడానికి RBDని SARS-CoV-2 వినియోగించుకుంటుందని తేలింది.  కోవిడ్-19 సోకిన వ్యక్తులు, రెండుసార్లు టీకాలు పొందిన వ్యక్తులతో పాటు డెల్టా నుంచి కోలుకున్న వారిలో యాంటీబాడీ రక్షణ కల్పిస్తాయని పరిశోధనలు గుర్తించారు. కానీ, ఒమిక్రాన్‌కు వేరియంట్‌తో మాత్రం యాంటీబాడీస్ రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌ను నిరోధించలేకపోయాయని పరిశోధకులు గుర్తించారు.

మూడో టీకా తీసుకున్న వారిలో ఒమిక్రాన్ నుంచి రక్షణ పొందవచ్చునని అధ్యయనం కనుగొంది. మూడవ టీకా తీసుకున్న చాలామందిలో ఒమిక్రాన్‌ నియంత్రించే యాంటీబాడీలను అభివృద్ధి చేసినట్టు గుర్తించారు. గణనీయంగా 20 శాతం మందిలో ఎలాంటి యాంటీబాడీల రక్షణ అందించలేదని పరిశోధనా బృందంలోని రుడాల్ఫ్ వాలెంటా వెల్లడించారు. Omicron అనేది RBDలోని మునుపటి వేరియంట్‌లకు చాలా భిన్నమైన వేరియంట్‌గా గుర్తించారు. గత వేరియంట్‌లతో పోలిస్తే.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లు ఒమిక్రాన్‌కు తక్కువ లేదా ఎలాంటి రక్షణను అందించలేవని కనుగొన్నారు.

Read Also : Deltacron : డెల్టా, ఒమిక్రాన్ కలిస్తే డెల్టాక్రాన్.. ఇదో కొవిడ్ స్ట్రెయిన్.. లక్షణాలేంటి? నిపుణుల మాటల్లోనే..!

ట్రెండింగ్ వార్తలు