Covid Vaccines Vaccines Gives 96 Percent Protection From Virus After Infected People
Covid Vaccines Safe : కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఇన్‌ఫెక్షన్ నుంచి 96శాతం రక్షణ ఇస్తోందని తేలింది. వ్యాక్సిన్ వేయించుకున్నాక కరోనా బారినపడినప్పటికీ వ్యాధి తీవ్రత స్వల్పంగానే ఉంటోందని కొత్త పరిశోధనలో వెల్లడైంది. అమెరికాలో ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ వేసుకున్న సిబ్బందిపై సెయింట్ జ్యూడ్ చిల్డ్రన్ రీసెర్చ్ ఆస్పత్రి సైంటిస్టులు ఇటీవల అధ్యయనం చేశారు.
గత డిసెంబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకూ మొత్తం 5,217 మంది అధ్యయనంలో పాల్గొన్నారు. వీరిలో 58శాతం మంది ఫైజర్-బయోఎన్‌టెక్ టీకా తీసుకున్నవారు ఉన్నారు. అధ్యయన సమయంలో మొత్తం 236 మంది కరోనాకు గురయ్యారు. వారిలో 185 మంది ఎలాంటి వ్యాక్సిన్ తీసుకొనివారే ఉన్నారు.
‘వ్యాక్సిన్ తీసుకున్నవారికి వైరస్ సోకినప్పటికీ లక్షణాలు కనిపించినా లేదా కనిపించకపోయినా ఇన్‌ఫెక్షన్ల తీవ్రత సగటున 79శాతం తక్కువగా ఉంటున్నాయని తేలింది. రెండో డోసు తీసుకున్న తర్వాత కనీసం వారం రోజులకు కొవిడ్ నుంచి 96శాతం రక్షణ అందుతోంది. టీకా వేయించుకున్న వారి నుంచి ఇతరులకు కొవిడ్ సోకే ముప్పు కూడా తక్కువే అంటున్నారు.