Banyan Tree
Banyan Tree : మర్రి చెట్టు గురించి తెలియని వారుండరు. గ్రామాల్లో, రోడ్ల వెంట విస్తారంగా మర్రి చెట్లు కనిపిస్తుంటాయి. ఎక్కువ కాలం జీవించ గలిగే చెట్లలో మర్రి కూడా ఒకటి. చల్లని నీడను ఇవ్వటంతోపాటు పక్షులు వంటి అనేక జీవరాశికి ఇది ఆసరగా ఉంటుంది. మర్రి చెట్టులోని ప్రతి భాగం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలకు దోహదపడుతుందని ఆయుర్వేదనిపుణులు చెబుతున్నారు. మర్రి బెరడు, లేత ఆకులు, మర్రి మొగ్గలు, పాలను వివిధ రకాల వ్యాధుల్లో ఉపయోగిస్తున్నారు. విరేచనాల సమస్యతో బాధపడేవారికి మర్రి బాగా పనిచేస్తుంది. రాత్రంతా మర్రి చెట్టు చిగురు ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఆనీటిని తాగితే విరోచనాలు తగ్గిపోతాయి.
ఫైల్స్ సమస్య చాలా మందిని వేధిస్తుంటుంది. నొప్పికి తట్టుకోలేని పరిస్ధితుల్లో ఉన్నవారికి మర్రిపాలు చక్కగా ఉపయోగపడతాయి. మర్రిపాలు 5 చుక్కల్ని ఒక గ్లాసు పాలలో కలిపి తీసుకుంటే ఫైల్స్ సమస్య పరిష్కారమౌతుంది. అలాగే మర్రి ఊడలు సంతానలేమితో బాధపడుతున్న వారికి చక్కని ఔషదంగా పనిచేస్తుంది. మర్రి ఊడల చివరి లేత బాగాలను ఎండబెట్టి తరువాత దానిని మెత్తగా పొడిగా చేసుకోవాలి. దానిని పాలల్లో కలిపి రుతుస్రావం తరువాత 3 రోజుల పాటు తాగితే సంతానం కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
కీళ్ళనొప్పులు, దంత సమస్యలకు మర్రి ఊడలతో తయారు చేసిన పొడి అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా పదే పదే మూత్ర విసర్జనకు వెళ్ళటం చాలా మందిలో చూస్తుంటాం. వాటర్ తాగిన కొద్ది సేపటికే మూత్రం విసర్జన రావటం జరుగుతుంది. ఇలా జరగటాన్ని అతి మూత్ర సమస్యగా పిలుస్తుంటాం. ఈ సమస్యతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. దీని వల్ల ముఖ్యం ప్రయాణాల సందర్భంలో పదేపదే మూత్ర విసర్జన చేయాల్సి రావటం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అతి మూత్ర సమస్యకు మర్రి బెరడు చక్కని పరిష్కారమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఇందుకు గాను చేయాల్సిందల్లా మర్రి చెట్టు బెరడును బెత్తెడు ముక్కను తీసుకోవాలి. దానిని చిన్నిచిన్న ముక్కలుగా చేయాలి. ఆ ముక్కలను పెద్ద గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ వాటర్ సగం వచ్చే వరకు బాగా మరగించాలి. తరువాత దానిని వడగట్టి తాగాలి. ఇలా చేయటం వల్ల అతిమూత్ర సమస్య తొలగిపోతుంది. అదే విధంగా మర్రి ఊడలతో నూనె తయారు చేసుకుని వాడడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. జుట్టు నిగనిగలాడటంతోపాటు, చుండ్రు తగ్గుతుంది.
మర్రి కాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించటంలో బాగా పనిచేస్తాయి. అదే విధంగా షుగర్ ను అదుపులో ఉంచుతాయి. రక్తంలో గ్లూకోజ్ స్ధాయిలను సమతుల్యం చేస్తుంది. చాలా మంది మహిళల వక్షోజాలు సాగిపోయినట్టు ఉంటే మర్రి వేర్లను పొడిని పేస్ట్ లా తయారు చేసి వక్షోజాలపై అప్లై చేయాలి. ఇలా చేయటం వల్ల వక్షోజాలు బిగుతుగా మారతాయి. అంతేకాకుండా స్త్రీలలో వచ్చే జననాంగాలకు వచ్చే వ్యాధులను తగ్గించే గుణం మర్రి బెరడుపొడిలో ఉంది. చర్మ సౌందర్యాన్ని పెపొందించటంలో మర్రి బాగా ఉపయోగపడుతుంది.