Crying Room : క్రైయింగ్‌ రూం…బాధల్లో ఏడ్వచ్చు

స్పెయిన్‌లో క్రైయింగ్‌ రూం లను ప్రారంభించడానికి ఆత్మహత్యలు ఎక్కువగా జరుగడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 2019 లో స్పెయిన్‌లో 3,671 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతి 10 మంది టీనేజర్లలో ఒకరు మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి.

Crying Room : మనిషన్నతరువాత బాధలు తప్పవు. బాధలు వచ్చిన సందర్భంలో చాలా మంది ఎవరితో చెప్పుకోవాలో తెలియక తమలో తామే కుమిలిపోతుంటారు. మరికొందరైతే బంధువులకో,స్నేహితులతోనో పంచుకుంటుంటారు. ఆసమయంలో వారు ఎంతో దుఖ:తో నిండిఉంటారు. కళ్ళ వెంటనీరు ఆగదు. అదేపనిగా ఏడ్చేస్తుంటారు. మన బాధలను ఎవరితోనైనా పంచుకుంటే ఉపశమనం కలుగుతుందని పెద్ద వాళ్లు చెప్తుంటారు. ఎవరైనా ఏడుస్తూ వారి ఆక్రమందనను, బాధను వెళ్ళగక్కుతుంటే వాళ్లను అడ్డుకోవద్దు. పక్కవాడికి వినిపించనంతగా ఏడ్వడం వల్ల నష్టమే తప్ప లాభం లేదంటున్నారు అధ్యయనకారులు.

బిగ్గరగా ఏడవడం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. వీరి సూచనల మేరకు స్పానిష్ ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్ ఈ క్రైయింగ్‌ రూం ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో స్పెయిన్‌లో క్రైయింగ్‌ రూం సంస్కృతి అందుబాటులోకి వచ్చినట్లైంది. అక్టోబర్ 10 న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వీటిని ప్రారంభించారు. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను అధిగమించడానికి స్పెయిన్‌లో క్రైయింగ్ రూమ్ ప్రాజెక్ట్ ప్రారంభించారు.

స్పెయిన్‌లో క్రైయింగ్‌ రూం లను ప్రారంభించడానికి ఆత్మహత్యలు ఎక్కువగా జరుగడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 2019 లో స్పెయిన్‌లో 3,671 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతి 10 మంది టీనేజర్లలో ఒకరు మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. అంటే మానసిక వైఫల్యం చెందుతున్న వారిలో యువత ఎక్కవగా ఉన్నట్లు తేలింది. ఇక్కడి జనాభాలో 5.8 శాతం మంది ఆందోళనతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మానసికంగా కలవరపాటుకు గురైన వారు ఎవరైనా మాడ్రిడ్‌లోని ఈ గదిలోకి వచ్చి బహిరంగంగా ఏడవవచ్చు. అలాగే గట్టిగా అరవవచ్చు కూడా. దీంతో పాటు వారికి కావాల్సిన సహాయంన్ని అడిగి పొందే అవకాశం ఉంటుంది. అక్కడే మానసిక వైద్యులు ఎప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకుని వారికి అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తారు.

గదిలో ఒక మూలలో మీరు స్వేచ్ఛగా మాట్లాడగలిగే వ్యక్తుల పేర్లుంటాయి. వారితో మాట్లాడి మీ బాధను వారితో పంచుకోవచ్చు. మానసిక ఆరోగ్యంపై సలహాలు కూడా పొందవచ్చు. దీని కోసం ఫోన్ నంబర్‌ కూడా అందుబాటులో ఉంటుంది. గోడపై అతికించిన పోస్టర్‌లపై మీ గురించి నేను కూడా ఆందోళన చెందుతున్నాను అంటూ రాసి ఉంటుంది. సెంట్రల్ మాడ్రిడ్‌లోని ఒక భవనంలో ఈ క్రైయింగ్‌ రూం లోకి ఎవరైనా రావచ్చు. మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులను దాని నుండి బయటకు తీసుకురావడమే ఈ రూం ప్రధాన ఉద్దేశం. ఈ గది మొత్తంగా పింక్ కలర్ లో ఉండటం విశేషం.

ట్రెండింగ్ వార్తలు