Custard Apple : చలికాలంలో జీర్ణశక్తిని పెంచే సీతాఫలం!

సీతాఫలంలో కాపర్, పీచు పదార్ధాలు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి. గర్భం దాల్చిన మహిళలు తీసుకోవటం వల్ల పిండం అభివృద్ధిలో సహాయపడుతుంది.

Custard Apple : అన్ని పండ్లలాగానే సీతాఫలంలోనూ పోషకాలు అధికంగా ఉంటాయి. సి విటమిన్ తోపాటు, ఎ, బి, కె విటమిన్లూ ప్రొటీన్లూ కాల్షియం, ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచటంలో సహయపడతాయి. సీతాఫలంలో ఉండే విటమిన్ ఎ తోపాటు ఇతర పోషకాలు కణజాల పునరుద్ధరణకు తోడ్పడతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంచటానికి , ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ తగ్గటానికి సహాయపడుతుంది. సీతాఫలంలో అరటి పండ్ల కన్నా అధికంగా పొటాషియం ఉండటం వల్ల గుండెకు ఎంతో మేలు చేస్తుంది. బీపీని తగ్గిస్తుంది.

సీతాఫలంలో కాపర్, పీచు పదార్ధాలు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి. గర్భం దాల్చిన మహిళలు తీసుకోవటం వల్ల పిండం అభివృద్ధిలో సహాయపడుతుంది. విటమిన్ సి, రైబో ఫ్లెవిన్ , ప్రీరాడికల్స్ తో పోరాడి కంటి చూపు స్పష్టంగా కనిపించేందుకు సహాయపడతాయి. బరువును అదుపులో ఉంచటంతోపాటు మంచి శరీర అకృతి కావాల్సిన వారు సీతాఫలాలను తీసుకోవచ్చు. ఈ పండులో ఉండే అసిటోజెనిన్ , ఆల్కలాయిడ్స్ ఎలాంటి క్యాన్సర్లు రాకుండా శరీరాన్ని కాపాడుతాయి. బలహీనంగా ఉన్నపిల్లలకు సీతాఫలం గుజ్జను తేనెతో కలిపి ఇస్తే అధిక శక్తి ని ఇస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచే ఔషధ గుణగణాలు సీతాఫలంలో దాగి ఉన్నాయి. కొన్ని దీర్ఘకాలిక వ్యాధులను కూడా అంతమొందించిచడానికి సీతాఫలం ఎంతగానో దోహదపడుతోంది. తలలో చుండ్రు వున్నవారికి ఎండిన సీతాఫలం గింజను మెత్తగా పొడికొట్టి, ప్రతిరోజూ ఆ పొడిని షాంపులాగా ఉపయోగిస్తూ స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. సీతాఫలం గింజల్ని పొడిచేసి తలకు రాసుకుంటే పేల సమస్య ఉండదు. మెదడుకు, నరాల వ్యవస్థకూ సీతాఫలం ఉపయోగకరంగా ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు