Dark Chocolate : చెడు కొలెస్ట్రాల్ స్ధాయిని తగ్గించే డార్క్ చాక్లెట్ ! రోజుకు ఎంత మోతాదులో తినాలంటే?

శరీంలో ఎల్డీఎల్ స్థాయి పెరిగితే ఇది గుండెపోటుకు దారితీస్తుంది. డార్క్ చాక్లెట్ తినడం ద్వారా ఎల్డీఎల్ స్థాయి తగ్గుతుంది. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్‌డిఎల్‌ను పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. తద్వారా గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది.

Dark chocolate that reduces bad cholesterol level! How much to eat per day?

Dark Chocolate : డార్క్ చాక్లెట్ తింటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఈ డార్క్ చాక్లెట్లు ‘థియోబ్రామా కాకో’ అని పిలువబడే కాకో చెట్టు భాగాల నుండి తయారు చేయబడతాయి. డార్క్ చాక్లెట్‌లో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, మెగ్నీషియం, రాగి, మాంగనీస్, పొటాషియం, భాస్వరం, జింక్, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. డార్క్ చాక్లెట్ తయారీలో వాడే కోకో పౌడర్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలపడి ఎటువంటి ఇన్ఫెక్షన్లు ధరిచేరవు.

డార్క్ చాక్లెట్ తినడం వల్ల శరీరంలోని రక్తప్రసరణ పెరుగుతుంది. డార్క్ చాక్లెట్ ధమనులలో చెడు కొలెస్ట్రాల్ ను రాకుండా చేస్తుంది. ప్రతిరోజు డార్క్ చాక్లెట్ తినేవారిలో స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా తక్కువని అధ్యయనాల్లో తేలింది. ఈ చాక్లెట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. ప్రతిరోజు 10గ్రాముల మోతాదులో తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. డార్క్ చాక్లెట్ తినడం వల్ల మీ శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ లెవల్ పెరుగుతాయి. నైట్రిక్ ఆక్సైడ్ కారణంగా రక్తపోటు తగ్గుతుంది.

శరీంలో ఎల్డీఎల్ స్థాయి పెరిగితే ఇది గుండెపోటుకు దారితీస్తుంది. డార్క్ చాక్లెట్ తినడం ద్వారా ఎల్డీఎల్ స్థాయి తగ్గుతుంది. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్‌డిఎల్‌ను పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. తద్వారా గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. జ్ఞాపకశక్తిని పెంచడానికి, మీ మెదడును ఉత్తేజం చేయడానికి డార్క్ చాక్లెట్ సహాయపడుతుంది. జీవక్రియను పెంచడానికి, శరీరంలోని కొవ్వును కరిగించడానికి సహకరిస్తాయి. డార్క్ చాక్లెట్ కేలరీలతో నిండి ఉన్నప్పటికీ, బరువు తగ్గడానికి అనుకూలంగా ఉండే పదార్థాలు ఇందులో ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు.

డార్క్ చాక్లెట్ వయస్సు పెరుగుదల వల్ల వచ్చే ముఖ ముడతలను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. శరీరంలోని కాలుష్య కారకాలను తొలగిపోయేలా చేస్తాయి. చర్మం దెబ్బతినడానికి గల ప్రధాన కారణాలలో ఒకటి సూర్యుని అతినీలలోహిత కిరణాలు. ఈ డ్యామేజ్​ను నివారించడానికి డార్క్ చాక్లెట్ తీసుకోవటం మంచిది.