Delta Plus Variant : దేశంలో కొత్తగా డెల్టా ప్లస్ వేరియంట్ గుర్తింపు!

భారత్‌ను బెంబేలిత్తిస్తోన్న కరోనా డెల్టా వేరియంట్ మరింత ప్రమాదకరంగా మారింది. ఎప్పటికప్పుడూ రూపాన్ని మార్చుకుంటూ ప్రాణాంతకంగా మారుతోంది. ఇప్పటికే డెల్టా స్ట్రెయిన్ విషయంలో భయాందోళనకు గురిచేస్తుంటే..

Delta Plus Variant : భారత్‌ను బెంబేలిత్తిస్తోన్న కరోనా డెల్టా వేరియంట్ మరింత ప్రమాదకరంగా మారింది. ఎప్పటికప్పుడూ రూపాన్ని మార్చుకుంటూ ప్రాణాంతకంగా మారుతోంది. ఇప్పటికే డెల్టా స్ట్రెయిన్ విషయంలో భయాందోళనకు గురిచేస్తుంటే.. డెల్టా ప్లస్ స్ట్రెయిన్‌గా రూపాంతరం చెందినట్టు గుర్తించారు. పాత డెల్టా వేరియంట్ కంటే ఈ కొత్త డెల్టా ప్లస్ వేరియంట్ ప్రోటీన్ మార్పులతో రూపాంతరం చెందుతోంది. డెల్టా స్పైక్ ప్రోటీన్‌లో కొత్తగా మార్పులను గుర్తించారు.

నాడి వ్యవస్థతో పాటు రోగనిరోధక వ్యవస్థను మాయ చేస్తుందని తేలింది. ప్రస్తుతానికి ఈ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు తక్కువే అయినప్పటికీ.. వైరస్ ఉదృతి పెరిగే అవకాశం లేకపోలేదు. కరోనా బాధితులకు ఇచ్చే ఔషధమైన మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్ టెయిల్ ఈ కొత్త రకం డెల్టా ప్లస్ వేరియంట్ పై పనిచేయదని సైంటిస్టులు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి ఈ కొత్త డెల్టా వేరియంట్ ఇంగ్లండ్ మొదట కనుగొన్నారు. దీనిపై లోతుగా అధ్యయనం చేస్తున్న సమయంలో ఈ విషయం బయటపడింది.

ఆ తర్వాత భారత్ లోనూ ఈ రకం ఉన్నట్టు గుర్తించారు. జూన్ 11 నాటికే డెల్టా ప్లస్ వేరియంట్ 63 మందికి సోకినట్టు గుర్తించారు. జూన్ 6 నాటికి దేశంలో ఆరు వరకు డెల్టా ప్లస్ కేసులు నమోదైనట్టు సమాచారం.

డెల్టా వేరియంట్ అనేక రూపాంతరాలు చెందుతోందని, యూరప్, ఆసియా, అమెరికా వంటి దేశాల్లో 127 రకాలుగా వేరియంట్ రూపాంతరం చెందిందని అంటున్నారు వైద్య నిపుణులు. డెల్టాప్లస్ వేరియంట్ మూలం ఎక్కడ అనేదానిపై క్లారిటీ లేదు. ఈ వేరియంట్ మూలాలు ఎక్కడో పరిశోధించే ప్రయత్నాల్లో పడ్డారు సైంటిస్టులు.

ట్రెండింగ్ వార్తలు