Delta Variant : డెల్టా.. వ్యాక్సిన్ యాంటీబాడీల కన్నా 8 రెట్లు తక్కువ ప్రభావితం.. కానీ, వుహాన్ స్ట్రెయిన్ కంటే డేంజరస్..!

డెల్టా వేరియంట్.. ఈ పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది. రోజురోజూకీ డెల్టా కేసుల సంఖ్య పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. కొవిడ్ వ్యాక్సిన్లు వచ్చినప్పటికీ కూడా డెల్టా వేరియంట్ మహమ్మారిగా విజృంభిస్తోంది.

Delta Variant Wuhan Strain

Delta variant-Wuhan Strain : డెల్టా వేరియంట్.. ఈ పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది. రోజురోజూకీ డెల్టా కేసుల సంఖ్య పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. కొవిడ్ వ్యాక్సిన్లు వచ్చినప్పటికీ కూడా డెల్టా వేరియంట్ మహమ్మారిగా విజృంభిస్తోంది. అయితే.. డెల్టా వేరియంట్.. కరోనా వ్యాక్సిన్ల యాంటీబాడీల కంటే ఎనిమిది రెట్లు తక్కువ ప్రభావితమైనదని, కానీ, అసలైన వుహాన్ స్ట్రెయిన్ కన్నా వేగంగా వ్యాపించగలదని ఓ అధ్యయనంలో తేలింది. ఢిల్లీలోని 100 హెల్త్ కేర్ వర్కర్లపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

వాస్తవానికి.. ఈ డెల్టా వేరియంట్ కూడా వుహాన్ స్ట్రెయిన్ కన్నా తీవ్రమైన అంటువ్యాధిగా కొత్త అధ్యయనంలో రుజువైంది. భారత్‌లో Delta variant Emergence and Vaccine Breakthrough: Collaborative Study (SARS-Cov -2 B.1.617.2) పేరుతో అధ్యయనం నిర్వహించారు. ఇమ్యునాలజీ & ఇన్ఫెక్షియస్ డిసీజ్ కేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన శాస్త్రవేత్తలంతా కలిసి సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కరోనా నుంచి కోలుకున్నవారిలోని యాంటీబాడీలను తటస్థీకరించడానికి డెల్టా వేరియంట్ తక్కువ ప్రభావితమైనదిగా గుర్తించారు. కానీ, ఆల్ఫా (Alpha Variant) వేరియంట్‌తో పోలిస్తే అత్యంత ప్రమాదకరమైనదని (higher replication efficiency) అధ్యయనంలో తేలింది.

భారతదేశంలోని మూడు సెంటర్లలో 100 మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలలో వ్యాక్సిన్ పురోగతిపై పరిశోధకులు విశ్లేషణ జరిపారు. ఇందులో B.1.617.2 డెల్టా వేరియంట్.. డెల్టా-కాని అంటువ్యాధులతో పోలిస్తే వ్యాక్సిన్ల యాంటీబాడీలపై ఆధిపత్యం చేయడమే కాదు.. పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కూడా తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతుందని అంటున్నారు.

ఇతర వేరియంట్లలో B.1.1.7 (Alpha variant) లేదా B.1.617.1 (Kappa variant)తో పోలిస్తే.. డెల్టా వేరియంట్ మహమ్మారిగా విజృంభిస్తుందని హెచ్చరిస్తున్నారు. డెల్టా వేరియంట్ వ్యాప్తి.. ఈ వేరియంట్ ఊపిరితిత్తుల ఎపిథీలియల్ కణాలకు (lung epithelial cells) స్పైక్ ప్రోటీన్లను పెంచుకున్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. అసలు వుహాన్ జాతి కంటే ఎక్కువ మందికి సోకే సామర్థ్యాన్ని కలిగి ఉందని హెచ్చరిస్తున్నారు.