చిన్న మొక్కలతో ఒత్తిడి దూరం

  • Publish Date - January 5, 2020 / 02:54 AM IST

కార్యాలయాలు, పని చేసే ప్రదేశాల్లో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారా ? అయితే మీ కోసమే. వర్క్ చేసే ప్రదేశంలో సులభంగా చూడగలిగే చిన్న మొక్కలును పెంచాలని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. దీనివల్ల ఒత్తిడిని తగ్గుతుందంటున్నారు. హార్ట్ టెక్నాలజీ పత్రికలో ఓ కథనం ప్రచురితమైంది. మానసిక ఆరోగ్యాన్ని పెంచడానికి మొక్కలు ఉపయోగపడుతాయని పరిశోధనలో వెల్లడైనట్లు వెల్లడించారు. 

వర్క్ చేసే ప్లేస్‌లో చిన్న మొక్కలు పెంచడం వల్ల చాలా మంది ఒత్తిడి నుంచి బయటపడ్డారని జపాన్‌లోని హ్యోగో యూనివర్సిటీ పరిశోధకుడు మసాహిరో టయోడా తెలిపారు. చిన్న మొక్క ఒత్తిడితో సహా, ఎన్నో రోగాలను నయం చేస్తుందన్నారు. జపాన్‌లోని 63 మంది ఉద్యోగులు అధ్యయనంలో పాల్గొన్నారు. వర్కర్స్ డెస్క్ వద్ద చిన్న మొక్కలను ఉంచి వారిలో జరుగుతున్న మార్పులను స్టడీ చేశారు. అలసట అనిపించే సమయంలో డెస్క్‌ల వద్ద మూడు నిమిషాల పాటు కూర్చోవాలని బృందం సూచించింది. మొక్కను చూడడం వల్ల మానసిక ప్రశాంత కలిగి ఉన్నారని తేలిందన్నారు. 

అదే సమయంలో మొక్కలు లేని స్థలంలో ఉద్యోగుల పని తీరును గమనించారు. ఇరువరి మధ్య బోలెడు వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. కంప్యూటర్ల దగ్గర మొక్కను పెంచిన వారు..పనిని వేగంగా పూర్తి చేయడంతో పాటు ఉల్లాసంగా ఉన్నారని బృందం వెల్లడించింది. బోన్సాయ్, శాన్ పెడ్రో కాక్టస్, ఆకుల మొక్కలు, కోకెడామా, ఎచెవేరియా మొక్కలను ఇచ్చామన్నారు. ఇండోర్ ప్లాంట్లు పని చేసే వారి పరిస్థితుల్లో మెరుగైన మార్పు వస్తుందని అధ్యయన బృందం వెల్లడిస్తోంది. 

Read More : అమెరికా దాడులపై కార్గిల్‌లో నిరసన ర్యాలీలు