Mangoes : మధుమేహులు మామిడిపండ్లు తింటున్నారా!

మామిడిలోని కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి మరియు ద్వితీయ వైద్య పరిస్థితులకు దారితీయవచ్చు కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడిని తీసుకోవడం సాధారణంగా సిఫార్సు చేయబడదు.

Diabetics Eat Mangoes

Mangoes : వేసవి కాలంలో విరివిగా లభించే పండ్లలో మామిడి పండ్లు ప్రధానమైనవి. చాలా మంది మామిడి పండ్ల రుచి చూడకుండా ఉండలేరు. మామిడ పండ్లో పోష‌కాల విషయానికి వస్తే సి, ఎ, బి6, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ వంటివి పుష్క‌లంగా లభిస్తాయి. మామిడి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే డ‌యాబెటీస్ ఉన్న‌వారు మాత్రం మామిడిపండ్లు తినే విషయంలో జాగ్ర‌త్తపాటించటం మంచిది.

రక్తంలో చక్కెర పెరుగుతుందన్న ఉద్ధేశంతో మధుమేహులు మామిడి పండును తినేందుకు భయపడతారు. మధుమేహం ఉన్నవారు మామిడిపండు తినే విషయంలో జాగ్రత్తపడటం మంచిదే. అలాగని పూర్తిగా నివారించాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. మితంగా తీసుకుంటే చక్కెర స్ధాయిలో పెద్ద మోతాదులో పెరిగే అవకాశం లేదంటున్నారు. మామిడిలోని కార్భోహైడ్రేట్లు చక్కెర స్ధాయిలను పెంచే విషయం వాస్తవం. మామిడిలో సహజ చక్కెర ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదలకు కారణమౌతుంది.

మామిడిలోని కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి మరియు ద్వితీయ వైద్య పరిస్థితులకు దారితీయవచ్చు కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడిని తీసుకోవడం సాధారణంగా సిఫార్సు చేయబడదు. రక్తంలో చక్కెర స్థాయిలపై మామిడిపండు నేరుగా ప్రభావితం చేస్తుంది. రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంచుకోవాలంటే మామిడిపండ్లను మితంగా తీసుకోవాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ 56 తక్కువగా ఉన్నప్పటికీ, మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని మితంగా తీసుకోవాలి.

ఉద‌యం, మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నం చేసిన వెంట‌నే మాత్రం మామిడి పండ్ల‌ను తిన‌రాదు. ఇలా చేస్తే మామిడి పండు వల్ల ల‌భించే క్యాల‌రీలు అన్నీ కొవ్వు కింద మారుతాయి. ర‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ కూడా అమాంతంగా పెరుగుతాయి. కాబట్టి షుగర్ వ్యాధి గ్రస్తులు మామిడి పండు తినే విషయంలో వైద్యుల సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.