Migrane Headache
Migraine Headache: మైగ్రేన్‌లను తరచుగా ఇతర తలనొప్పులుగానూ పరిగణిస్తాం. ఒక్కోసారి తలనొప్పి లక్షణాలు ఊహకందవు. అవి ముదిరి న్యూరలాజికల్ సమస్యగానూ మారతాయి. ఎవరైనా నెలకు 15రోజులకు ఒకసారి తలనొప్పి వస్తూనే ఉంటే.. అందులో 8రోజులైనా తలనొప్పిగా ఫీల్ అయితే మైగ్రేన్ గా పరిగణించవచ్చు.
తలనొప్పిగా మొదలై తక్కువ తీవ్రతతో కొద్ది రోజుల పాటు ఉండే నొప్పి క్రోనిక్ మైగ్రేన్ గా పరిగణిస్తారు. క్రోనిక్ మైగ్రేన్.. సాధారణ తలనొప్పి కంటే తీవ్రంగా ఉంటుంది. అయితే వీటి మధ్య తేడా తెలుసుకోవాలంటే వాటి లక్షణాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.
నుదురు ప్రాంతంలో నొప్పి, మత్తుగా ఉండటం, వాంతి వచ్చినట్లుగా ఉండటం, వికారంగా అనిపించడం, వెలుతురు, శబ్ధం, వాసనలకు ఎక్కువగా రియాక్షన్ అనిపించడం వంటివి క్రోనిక్ మైగ్రేన్, మైగ్రేన్ తలనొప్పుల మధ్యఉండే కామన్ లక్షణాలు. టైమింగ్ డిఫరెన్స్ ను బట్టి అదేంటో తెలుసుకోవచ్చు. మైగ్రేన్ కనీసం 15రోజుల వరకూ ఉంటుంది.
Read Also : తలనొప్పికి చక్కని చిట్కాలు
క్రోనిక్ మైగ్రేన్ తలనొప్పి ఉన్న వాళ్లకు అందరికీ తలనొప్పి ఒకేలా ఉంటుందని చెప్పలేదం. నిద్రలేకపోవడం వల్ల, కెఫైన్ తీసుకోవడం వల్ల, ఒత్తిడి కారణంగా రావొచ్చు. క్రోనిక్ మైగ్రేన్ ఎక్కువగా మహిళల్లో వస్తుంటుంది. హార్మనల్ సమస్యల కారణంగా ఉండొచ్చు. క్రోనిక్ మైగ్రేన్ తో బాధపడే వాళ్లు రెగ్యూలర్ పనులు చేసుకోలేరు. వర్క్ , లేదా స్కూల్ కు వెళ్లడం వంటివి నార్మల్ గా చేసుకోలేరు.
రెగ్యూలర్ తలనొప్పులు ఎక్కువసేపు ఉండవు. కాసేపటి వరకూ ఇబ్బంది పెట్టినా రిపీటెడ్‌గా ఎక్కువ కాలం ఉండవు.
క్రోనిక్ తలనొప్పి తగ్గాలంటే పేషెంట్ ను పూర్తిగా స్టడీ చేయాల్సి ఉంటుంది. కొందరిలో తీవ్రతను బట్టి తగ్గేందుకు ఇంజెక్షన్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. లేదా మెడిసిన్ కొంతకాలం పాటు వాడుతూ ఉండాలి. మైగ్రేన్ రిపీట్ అయిందని గతంలో మెడిసిన్ మరోసారి తీసుకోవడం లాంటివి చేయకుండా డాక్టర్ ను కన్సల్ట్ అవడం మంచిది.
Read Also : కీళ్ళనొప్పులు, తీవ్రమైన తలనొప్పి తగ్గించే ఆయుర్వేద చిట్కాలు
ఏ ట్రీట్మెంట్ కు రెస్పాండ్ అవని వాళ్లు.. న్యూరాలజీ, సైకియాట్రి, సైకాలజీ, నర్సింగ్, ఫిజికల్ థెరఫీ, సోషల్ వర్క్ డిపార్ట్ మెంట్లను కలిస్తే బెనిఫిట్ ఉంటుంది. మైగ్రేన్ తో బాధపడే పేషెంట్లు తమ డాక్టర్లు కలిసినప్పుడు మల్టీ టీమ్ సపోర్ట్ ఉన్న హాస్పిటల్ కు రిఫర్ చేయమని అడగటం బెటర్.