Headache : తలనొప్పికి చక్కని చిట్కాలు
సమ్మర్‌లో తలనొప్పి రావడానికి డీహైడ్రేషన్ ఒక కారణంగా చెప్పొచ్చు. కనుక నిత్యం తగు మోతాదులో నీటిని తాగితే తలనొప్పి రాకుండా చూసుకోవచ్చు.చల్లని కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఇత

Headache
Headache : పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు మనకు తలనొప్పి వస్తుండడం సహజం. అలాగే పలు ఇతర సందర్భాల్లోనూ మనకు తలనొప్పి వస్తుంటుంది. ఇక వేసవిలోనైతే ఎండలో కొంత సేపు తిరిగితే తలనొప్పి కచ్చితంగా వస్తుంది. అయితే ఎలాంటి తలనొప్పి వచ్చినా సరే.. ఇక ఏ పనీ చేయబుద్ది కాదు. తలనొప్పికి తల పగిలిపోతుందేమోనని అనిపిస్తుంది. కానీ కింద సూచించిన పలు చిట్కాలను పాటిస్తే ఎలాంటి తలనొప్పినైనా ఇట్టే తగ్గించుకోవచ్చు.
ఎండలో తిరగాల్సి వస్తే తలకు టోపీ, క్యాప్ లాంటివి పెట్టుకోవాలి. లేదా స్కార్ఫ్ లాంటివి కూడా చుట్టుకోవాలి. వీటి వల్ల ఎండ నేరుగా మన తలకు తగలకుండా ఉంటుంది. దీంతో తలనొప్పి రాకుండా ఉంటుంది. ఎండలో తిరగడం వల్ల వచ్చిన తలనొప్పి అయితే కొంత సేపు చల్లని నీడలో ఉంటే తగ్గిపోతుంది. చల్లని ప్రదేశంలో ఉండి ముఖాన్ని చల్లని నీటితో కడుక్కోవాలి. కళ్లను బాగా కడగాలి. దీని వల్ల మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. రిలాక్స్ అయిన భావన కలిగి తలనొప్పి తగ్గుతుంది.
సమ్మర్‌లో తలనొప్పి రావడానికి డీహైడ్రేషన్ ఒక కారణంగా చెప్పొచ్చు. కనుక నిత్యం తగు మోతాదులో నీటిని తాగితే తలనొప్పి రాకుండా చూసుకోవచ్చు.చల్లని కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఇతర సహజ సిద్ధ పానీయాలను తాగితే తలనొప్పి ఇట్టే ఎగిరిపోతుంది. వట్టివేరుతో చల్లని పానీయం తయారు చేసుకుని తాగితే తలనొప్పి తగ్గుతుంది. అరటి పండ్లు, పైనాపిల్, పుచ్చకాయలను తినడం వల్ల కూడా తలనొప్పిని తగ్గించుకోవచ్చు. తలనొప్పి వచ్చిన ప్రతి సందర్భంలో పెయిన్ కిల్లర్స్ వాడటం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. న్యాచురల్ పద్ధతుల్లోనే తల నొప్పిని నివారించుకోవాలి.
తలనొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మ రసం కలిపి తీసుకోవాలి.ఇలా చేస్తే తలనొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు. ఒంట్లో వేడి ఎక్కువైనా తల నొప్పి వస్తుంటుంది. అందుకే సమ్మర్‌లో చలువ చేసే ఆహారాలను తీసుకోవాలి. ముఖ్యంగా సబ్జా వాటర్, పుచ్చకాయలు, కర్బుజా, కీర దోస, పుదీనా, మెంతులు వంటివి డైట్‌లో చేర్చుకుంటే తల నొప్పి రాకుండా ఉంటుంది.
తలనొప్పికి చెక్ పెట్టడంలో గంధం పొడి బాగా సహాయపడుతుంది. గంధం చెక్కను అరగ దీసి నుదుటిపై పూయాలి.ఇలా చేస్తే తల నొప్పి ఇట్టే పోతుంది. ఎండలో తిరగడం వల్ల తలనొప్పి వస్తే చల్లని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఆ తర్వాత కాసేపు ప్రాశాంతంగా విశ్రాంతి తీసుకుంటే తల నొప్పి మటుమాయం అవుతుంది. మద్యం అలవాటు ఉన్న వారికి సమ్మర్ లో తలనొప్పి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మద్యానికి ఎంత దూరంగా ఉండటం బెటర్.